RC16: కంటెంట్ కు తగ్గ టైటిల్.. ఇదేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ స్పీడ్ పెంచాడు. గేమ్ ఛేంజర్ అనంతరం RC16 షూటింగ్ కు అసలు బ్రేక్ ఇవ్వడం లేదు. దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ స్పీడ్ పెంచాడు. గేమ్ ఛేంజర్ అనంతరం RC16 షూటింగ్ కు అసలు బ్రేక్ ఇవ్వడం లేదు. దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రత్యేకంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా కావడం విశేషం. బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనతో పఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు రెండో సినిమాతో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ పొందడం, ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్‌ను పెంచింది.
ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పటి వరకు అనేక ఊహాగానాలు వినిపించాయి. ముందు ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజా సమాచారం మేరకు, ఈ సినిమాకు ‘పవర్ క్రికెట్’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దానికి తగ్గ టైటిల్‌ను ఖరారు చేసే పనిలో ఉన్నారు. క్రికెట్ తో పాటు కుస్తీ అనే అంశం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని సమాచారం.
ఇక పవర్ క్రికెట్ అనేది పాన్ ఇండియా రేంజ్ లో అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇదే టైటిల్‌ను ఫైనల్ చేస్తారా లేదా అనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27న టైటిల్ టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు RC16 షూటింగ్ 22 రోజుల పాటు జరిగింది.
మేకర్స్ మార్చి నుండి నెలకు 20 రోజులు షూట్ చేసేలా ప్లాన్ చేశారు. దీంతో సినిమా వేగంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. రామ్ చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. స్పోర్ట్స్ నేపథ్యంతో పాటు గ్రామీణ జీవన శైలికి సంబంధించిన ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక చిత్రానికి మ్యూజిక్ ఓ విశేష ఆకర్షణగా నిలవనుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండటంతో, సినిమాకు సంగీత పరంగా హైప్ మరింత పెరిగింది. మరోవైపు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి పాత్రలు కథలో ఎంతో ప్రాధాన్యం కలిగినవిగా ఉండనున్నాయని తెలుస్తోంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు ప్రాజెక్ట్ కోసం దాదాపు రెండు సంవత్సరాలుగా స్క్రిప్ట్ పై కసరత్తులు చేశాడు. కథ నేరేషన్ తర్వాత రామ్ చరణ్ సినిమా కథ అద్భుతమని కామెంట్ చేయడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. బుచ్చిబాబు తన రెండో సినిమాతోనే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం అతని టాలెంట్‌కు నిదర్శనం. ఈ చిత్రం కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా పాన్ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. మేకర్స్ దీనిని దేశవ్యాప్తంగా విస్తృతంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.