యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో మైథాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ఆది పురుష్. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ఓంరౌత్ ఆవిష్కరించాడు. అయితే ఇండియన్ మైథలాజికల్ టచ్ ఫీల్ లేకుండా కంటెంట్ ని కాస్త అడ్వాన్స్ లెవెల్ లో ఆలోచించి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా రీచ్ అయ్యేవిధంగా సరికొత్తగా తీర్చిదిద్దారు.
ఆది పురుష్ టీజర్ రిలీజ్ తర్వాత దేశవ్యాప్తంగా సినిమాపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. సినిమాలోని రాముడు, హనుమాన్, రావణుడి పాత్రలను డిజైన్ చేసిన విధానం హిందుత్వ విశ్వాసాలను నమ్మేవారికి నచ్చలేదు.
దీంతో సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ వచ్చాయి. దీంతో జనవరి సంక్రాంతి పండుగకి రిలీజ్ కావాల్సిన సినిమాని చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ వాయిదా వేయాల్సి వచ్చింది. కంటెంట్ తో పాటు, సినిమా గ్రాఫిక్స్ వర్క్ కూడా నాసిరకంగా ఉందనే టాక్ వచ్చింది.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ రావడంతో మరోసారి ఆది పురుష్ గ్రాఫిక్స్ వర్క్ పై దృష్టి పెట్టాలని చిత్ర నిర్మాతతో పాటు దర్శకుడు ఓంరౌత్ కూడా భావించారు. దీనికోసం మరో వంద కోట్లు అదనంగా వెచ్చించి గ్రాఫిక్స్ కోసం ఖర్చు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని దర్శకుడు అనౌన్స్ చేశాడు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుందని ట్విట్టర్లో తెలియజేశారు. అయితే అదే రోజు హాలీవుడ్ సినిమాలైన ది ఫ్లాష్, ఎలిమెంటల్ అమెరికాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిపైన భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. ఆది పురుష్ మూవీ రిలీజ్ కి వారం రోజుల ముందు మరో హాలీవుడ్ మూవీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా రిలీజ్ అవుతుంది.
ఈ నేపథ్యంలో యూఎస్ లో మెజారిటీ థియేటర్స్ లో హాలీవుడ్ మూవీస్ సందడి చేస్తాయి. దీంతో ఆది పురుష్ సినిమాకి తక్కువ థియేటర్స్ లభించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హాలీవుడ్ ప్రేక్షకులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా తెరకెక్కించిన నేపథ్యంలో అదే సమయంలో హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ కావడం ఆది పురుష్ సినిమాకి కొంత ప్రతికూలత అయ్యే అవకాశం ఉంది. మరి దీనిపై చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ దర్శకుడు ఓంరౌత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.