టాప్ స్టోరి: 500 కోట్ల‌లో స‌గం గ్రాఫిక్స్ కే పెడ‌తార‌ట‌

Update: 2020-08-23 04:30 GMT
వీ.ఎఫ్.ఎక్స్ ప‌రంగా భార‌త‌దేశంలో టాప్ -5 సినిమాల జాబితాని తిర‌గేస్తే అందులో 2.0- బాహుబ‌లి-రోబో - తానాజీ - ప‌ద్మావ‌త్ 3డి .. ఇలా కొన్ని రీసెంట్ సినిమాల్ని చెప్పుకోవ‌చ్చు. విజువ‌ల్ గ్రాఫిక్స్ కోసం అత్యంత భారీ బ‌డ్జెట్ల‌ను ఖ‌ర్చు చేశారు నిర్మాత‌లు. అందుకు త‌గ్గ‌ట్టే వెండితెర‌పై విజువ‌ల్ గ్రాండియారిటీ ఆవిష్కృత‌మైంది. ప్రేక్ష‌కులు అంతే పిచ్చిగా ఈ సినిమాల్ని చూసారు. ఫ‌లితంగా బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధ్య‌మ‌య్యాయి.

గ్రాఫిక్స్ మిక్స్ చేయాలంటే.. బ్లూమ్యాట్ - గ్రీన్ మ్యాట్ ఫార్మాట్ల‌లో ఇండోర్ షూటింగుల‌తో చాలా ప‌నిప‌డుతుంది. ఇప్పుడు డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించ‌నున్న 22వ సినిమాకి విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ఎక్కువ ప‌ని ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. కేవ‌లం గ్రాఫిక్స్ కోస‌మే దాదాపు 250కోట్ల మేర ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రామాయ‌ణ ఇతిహాసంలోని శ్రీ‌రాముని స్ఫూర్తితో మెలూహా త‌ర‌హా పాత్ర చిత్ర‌ణ‌తో ఉత్కంఠ భ‌రిత‌మైన స‌న్నివేశాల‌తో ఆదిపురుష్ ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అందుకు గ్రాఫిక్స్ ఎంతో అవ‌స‌రం ప‌డుతున్నాయి.

అవ‌తార్ .. 2.0 లాంటి సినిమాల గ్రాఫిక్స్ గురించి ఎంత‌గా చ‌ర్చించుకున్నారో అంత‌గా `ఆదిపురుష్` గురించి చ‌ర్చించుకునే వీలుంద‌న్న అంచ‌నాలు వేస్తున్నారు. తానాజీ ఫేం ఓం రౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టీసిరీస్ దాదాపు 500 -600 కోట్ల మేర బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ 22 అత‌డి కెరీర్ లోనే ఊహ‌కంద‌ని ప్ర‌త్యేక సినిమా అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.
Tags:    

Similar News