మనం చూసిన రామాయణ చిత్రాలకు 'ఆదిపురుష్' కు తేడా ఏంటంటే..?

Update: 2022-09-25 10:53 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ డ్రామా ''ఆదిపురుష్''. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కృతి సనన్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ - సన్నీ సింగ్ - సోనాల్ చౌహాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 'ఆదిపురుష్' చిత్రాన్ని రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపొందుతోంది. అయితే ఇప్పటివరకూ మనం చూసిన రామాయణం సినిమాలకు ప్రభాస్ రామాయణంకు చాలా తేడా ఉంది.

పాత రామాయణ చిత్రాలలో రాముడు క్లీన్ షేవ్ లో ఒక ఐడల్ గా కనిపిస్తాడు. కానీ ఇక్కడ 'ఆది పురుష్' సినిమాలో రాముడు రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. అసలు ఆ సమయంలో రియల్ రాముడు ఎలా కనిపిస్తాడు.. ఎలా ఉన్నాడు? వంటి అన్ని వివరాలు ఈ చిత్రంలో సరికొత్తగా ఆవిష్కరించబడతాయని నివేదికలు ఉన్నాయి.

మనం ఇప్పటి వరకూ చూసిన సినిమాల్లో మాదిరిగా కాకుండా.. ఇందులో పాత్రలు సాధారణ మానవుల కంటే కాస్త ఎక్కువ ఎత్తును కలిగివుంటాయని టాక్. అలానే పాత్రలన్నింటికీ ఒరిజినల్ నేమ్స్ ఉంటాయని తెలుస్తోంది. అంటే రాముడు - సీత - రావణుడు అని కాకుండా.. ప్రధాన పాత్రలు రాఘవ - జానకి - లంకేశ్ వంటి పేర్లతో పిలవబడతారని సమాచారం.

'ఆదిపురుష్' సినిమా షూటింగ్ కంప్లీట్ అయి చాలా కాలమే అయినా.. ఇప్పటికే విడుదల తేదీని ఖరారు చేసినా.. మేకర్స్ ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ 2వ తేదీన 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను లాంచ్ చేయనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీని కోసం అయోధ్యలో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. దీనిపై రేపో ఎల్లుండో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

మరోవైపు, అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో జరిగే రావణ్ దహన్ వేడుకకు హీరో ప్రభాస్ కూడా హాజరవుతారని లవ్-కుష్ రామ్‌ లీలా కమిటీ అధినేత ధృవీకరించారు.

కాగా, 'ఆదిపురుష్' ప్రభాస్ కు ఫస్ట్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ. తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి దర్శకుడు ఓం రౌత్ కృషి చేస్తున్నారు. కార్తీక్ పలనీ దీనికి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. సాచెత్ తాండన్ - పరంపరా ఠాకూర్ ద్వయం సంగీతం సమకూరుస్తున్నారు.

'ఆదిపురుష్' చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News