ముద్దుల లెక్కతో జెనీలియా హీరో

Update: 2018-06-07 04:00 GMT
బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీకి ముద్దుల హీరోగా పేరుంది. అతడి సినిమాల్లో చాలావరకు హీరోయిన్ తో లిప్ కిస్ లు ఉంటాయి. కొన్నింటిలో అయితే ఎన్ని ముద్దులు పెట్టాడో లెక్క పెట్టాలన్నా కష్టమే. ఇప్పుడు టాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మీని గుర్తు తెచ్చేందుకు ఓ హీరో రెడీ అవుతున్నాడు. కొన్నేళ్ల క్రితం జెనీలియా హీరోయిన్ గా నటించిన కథ సినిమాలో హీరోగా నటించాడు. తాజాగా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన పి.ఎస్.వి. గరుడవేగ సినిమా లోనూ అదిత్ అరుణ్ నటించాడు.

ప్రస్తుతం అదిత్ అరుణ్ 24 కిసెస్ అనే మూవీలో నటిస్తున్నాడు. మిణుగురులు సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న అయోధ్య కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదో ఇంటెన్స్ లవ్ స్టోరీ అంటున్నాడు అదిత్. ఇందులో కిస్సింగ్ సీన్లు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొస్తున్నాడు. తనకో గర్ల్ ఫ్రెండ్ ఉందని.. హీరోయిన్ కు ముద్దులు పెట్టేటప్పుడు ఆమెను గుర్తు చేసుకోవాలా.. వద్దా అన్న డైలమాలో పడిపోయానని అంటున్నాడు. మొత్తంమీద 24 ముద్దులు ప్రేక్షకులను మెప్పించేలానే పెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ ప్రస్తుత సమాజ పరిస్థితులకు అద్దం పడుతుందనేది అదిత్ మాట. ఆడియన్స్ డిఫరెంట్ సినిమాలను గ్యారంటీగా ఆదరిస్తారని.. 24 కిసెస్ డెఫినెట్ గా అలాంటి సినిమాయేనని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.

ఈ సినిమా తరవాత అదిత్ అరుణ్ ఇంకో సినిమాకు పచ్చజెండా ఊపాడు. హే డూడ్ టైటిల్ తో తెరకెక్కే ఈ మూవీని కొలంబస్ ఫేం డైరెక్టర్ రమేష్ సామల డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇందులో అదిత్ తో పాటు ప్రిన్స్.. ప్రియదర్శి కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News