ప్రస్తుత రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ కేవలం బాలీవుడ్ కె పరిమితం కావాలని అనుకోవడం లేదు. వారికి సెట్ అయ్యే విధంగా మంచి అవకాశం వస్తే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. మలయాళం తెలుగు కన్నడ బాలీవుడ్ అనే బేధ భావాలు ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. ప్రతి ఇండస్ట్రీలో100 కోట్ల బిజినెస్ నడుస్తోంది. దీంతో హీరోయిన్స్ కూడా రెమ్యునరేషన్ పరంగా కాకుండా మొదటి అడుగులో నటనపరంగా రాటు దేలడానికి అన్ని భాషల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఆ తరహాలో ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోన్న బ్యూటీ అదితి రావ్ హైదరి. ఈ ముద్దు గుమ్మ పుట్టింది ఇక్కడే అయినా సినిమాలు ఎక్కువగా చేసింది నార్త్ సైడే. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ బ్యూటీ ఇటీవల ఒక మంచి ఆఫర్ ని దక్కించుకుంది. 1980 నుంచి 1995 కాలంలో బాలీవుడ్ టాప్ సినిమా ఎడిటర్ గా వెలిగిన రేణు సలూజా బయోపిక్ లో నటించడానికి రెడీ అయ్యింది. ఆమె కెరీర్ ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోన్న సమయంలో ఎన్నో మలుపులు తీరిగింది. చివరికి 2000వ సంవత్సరంలో క్యాన్సర్ తో మృతి చెందారు. అయితే ఆమె సుదీర్ మిశ్రాను పెళ్లి చేసుకోక ముందు డైరెక్టర్ విదు వినోద్ చోప్రా తో రిలేషన్ లో ఉన్నారు.
అనుకోని కారణాల వల్ల ఆమె జీవితం ఉహించని విధంగా మారిపోయింది. ఇక ప్రస్తుతం తెరకెక్కుతోన్న బయోపిక్ సుదీర్ మిశ్రా తో గడిపిన జీవితం చుట్టూ తిరుగుతుందట. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను సుదీర్ మిశ్రనే తెరకెక్కిస్తున్నాడు. 'ఆమె చివరి రోజుల్లో నన్ను దూరం పెట్టడానికి ప్రయత్నించింది. అదే విధంగా తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. గడిపేది. కొన్ని సరిదిద్దుకోవడానికి కూడా చూసింది. ఆమె జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను సినిమాలో చూపించబోతున్నా' అని దర్శకుడు వివరించాడు.