ఫోటో స్టోరీ : అద్వితీయమైన అందం

Update: 2018-02-24 09:34 GMT
టైం కలిసి వచ్చే దాకా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతగా ఫలితం ఉండదని హీరొయిన్ ఆదితి రావు హైదరిని చూసి చెప్పొచ్చు. గత ఏడాది కల్ట్ క్లాసిక్స్ ఎక్స్ పర్ట్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా సినిమాతో పరిచయమైన ఈ భామ అది విజయం సాధించకపోవడంతో మనవాళ్ళ కంటికి ఆనలేదు. కాని విభిన్నమైన సినిమాలు తీయటంలో తనకంటూ ప్రత్యేకమైన టేస్ట్ ఉన్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాత్రం తన అందంలోని గమ్మత్తుని అప్పుడే పసిగట్టి తన ‘సమ్మోహనం’ సినిమా కోసం హీరొయిన్ గా బుక్ చేసుకున్నాడు. ఆయన నమ్మకం నిజమయ్యేలాగే ఉంది. పద్మావత్ లో ఖిల్జీ భార్యగా తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసిన ఆదితినిలోని నిజమైన నటిని అందులోనే చూసారు ప్రేక్షకులు.

అందుకే సమ్మోహనం సినిమా కోసం ఇంద్రగంటి తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించేలా ఈ సినిమా స్టిల్స్ తో ఆదితి చెప్పకనే చెబుతోంది. సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మధ్యే విడుదలైంది. తడిపొడి కురులను ఆరబోస్తున్నట్టు బుగ్గల వారగా వాటిని వయ్యారంగా వదిలేసిన తీరుకి కవిత్వం రాక మానదు. సింగల్ కాస్ట్యూమ్ లో ఫ్లవర్ డిజైన్ తో ఆకట్టుకునేలా నవ్వులు విరబూస్తు కవ్విస్తున్న ఆదితిని చూస్తే అవకాశాలు ఇస్తే టాలీవుడ్ కు మంచి హీరొయిన్ దొరికినట్టే అనిపిస్తుంది.

సమ్మోహనం షూటింగ్ ప్రస్తుతం చివరి స్టేజి లో ఉంది. గత ఏడాది అమీ తుమి లాంటి ఎంటర్ టైనర్ తో డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఇంద్రగంటి ఈసారి మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇది కనక ఆదితికి బ్రేక్ ఇస్తే నిర్మాతలు క్యు కడతారు. మణిరత్నం కొత్త సినిమా నవాబ్ లో కూడా ఆదితి హీరొయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఎవరి సరసన జోడిగా కనిపిస్తుంది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు.
Tags:    

Similar News