8 మంది పిల్లలు కావాలంటున్న హాట్‌ బ్యూటీ

Update: 2019-02-02 16:30 GMT
బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అదితి రావు హైదరి తెలుగులో సుధీర్‌ బాబుతో కలిసి 'సమ్మోహనం' చిత్రంలో నటించడం ద్వారా టాలీవుడ్‌ కు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత అంతరిక్షం చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించింది. తెలుగులో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నా కూడా ఆచి తూచి మరీ సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.

నాకు పిల్లలంటే చాలా ఇష్టం - ఆ ఇష్టంతోనే నేను 8 మంది పిల్లలను రాబోయే రెండు సంవత్సరాల్లో దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నాను. కుదిరితే ఇంకా ఎక్కువ మంది పిల్లలనయినా దత్తత తీసుకుంటానంటూ చెప్పుకొచ్చింది. దత్తత విషయాన్ని నేను పూర్తిగా ప్రకటించడం లేదు. ఎందుకంటే ఆ తర్వాత రోజుల్లో మీరు నన్ను ఈ విషయమై గన్‌ తలకు పెట్టినట్లుగా ప్రశ్నిస్తారు. అందుకే దత్తత విషయం గురించి త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తాను. అయితే రాబోయే రెండు సంవత్సరాల్లో ఇది జరగాలని - జరుగుతుందని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం హిందీ సినిమాలతో ఆటు తమిళంలో కూడా నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. తమిళంలో నటించిన మణిరత్నం మూవీ 'చెలియా' తనకు మంచి పేరు తచ్చి పెట్టిందని పేర్కొంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌ గారితో ఒక సినిమాను చేస్తున్నాను. ఆ సినిమాతో పాటు సైకో మరియు మిస్కిన్‌ అనే థ్రిల్లర్‌ చిత్రాల్లో కూడా నటిస్తున్నట్లుగా అదితి రావు పేర్కొంది. నటనతో పాటు గాయనిగా కూడా ఈమె గుర్తింపు దక్కించుకుంటుంది. ఏఆర్‌ రహమాన్‌ ఈమెతో ఒక పాట పాడించడం జరిగింది. సౌత్‌ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న కారణంగా బాలీవుడ్‌ సినిమాలు కాస్త తగ్గాయని, త్వరలోనే మళ్లీ బాలీవుడ్‌ లో నటిస్తానంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News