నిత్యా కాదు... అదితియేన‌ట‌

Update: 2018-05-03 17:30 GMT
స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమాలు తీసే ద‌ర్శ‌కుల్లో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఒక‌రు. మొద‌టి సినిమా ‘గ్ర‌హ‌ణం’ నుంచి  ‘అష్టాచెమ్మా’- ‘గోల్కొండ హై స్కూల్‌’- ‘అంత‌కు ముందు.. ఆ త‌ర్వాత‌’- ‘జెంటిల్మెన్‌’- ‘అమీతుమీ’ వంటి వెరైటీ కాన్సెప్ట్ చిత్రాల‌కే తీశారాయ‌న‌. ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా ‘స‌మ్మోహ‌నం’ అంటూ మ‌రో డిఫ‌రెంట్ మూవీతో రాబోతున్నాడు ఇంద్ర‌గంటి.

రీసెంటుగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌య్యింది. ఈ టీజ‌ర్ చూసిన వారికి హీరోయిన్ అదితి రావ్ హైద‌రి వాయిస్ విన‌గానే... హీరోయిన్ నిత్యామీన‌న్ గొంతే గుర్తుకు వ‌చ్చింది. అచ్చం నిత్యామీన‌న్ లా ప‌దాల‌ను విడగొడుతూ మాట్లాడింది అదితి. దాంతో అదితి కోసం నిత్యామీన‌న్ డ‌బ్బింగ్ చెప్పిందేమో అనుక‌న్నారంతా. అయితే ఈ వార్త‌లు ఎక్కువ కావ‌డంతో స్వ‌యంగా ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ స్వ‌యంగా స్పందించి... నిత్యా మీన‌న్ డబ్బింగ్ చెప్ప‌లేదని స్ప‌ష్టం చేశారు. ‘టీజ‌ర్ చూసిన వాళ్లంతా అదితి రావు పాత్ర‌కి నిత్యామీన‌న్ డ‌బ్బింగ్ చెప్పిందేమో అని పొర‌బ‌డుతున్నారు. నిజానికి అదితిరావు స్వ‌యంగా తెలుగులో త‌న పాత్ర‌కి డ‌బ్బింగ్ చెప్పుకుంది’ అని చెప్పారాయ‌న‌.

అదితి రావు హైద‌రి బాలీవుడ్ - కోలీవుడ్ భాష‌ల్లో మెరిసినా... నిజానికి అచ్చ తెలుగు హైద‌రాబాదీ అమ్మాయి. వ‌న‌ప‌ర్తి సంస్థాన రాజ‌వంశానికి చెందిన అదితి... తెలుగుని త్వ‌ర‌గానే ప‌ట్టుకుని త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకుంద‌ట‌. ఈ రొమాంటిక్ ఎంట‌ర్ ట్రైన‌ర్ టాలీవుడ్‌లో చెలియాకి మంచి అవ‌కాశాలే తెస్తుంద‌ని న‌మ్ముతోంది అదితి.
Tags:    

Similar News