ఫోటో స్టోరి: హైద్రాబాదీ కాస్మోపొలిటన్ అందాలు

Update: 2016-08-11 05:34 GMT
హైద్రాబాదీ భామ అదితి రావ్ హైదరి బాలీవుడ్ లో బిజీ బ్యూటీ. వరుసగా సినిమాలు చేసేస్తూ.. సౌత్ పై కూడా కన్నేసింది. ఈ భామ ఎంత అందగత్తో.. అందాన్ని ప్రదర్శించడంలో అంత ఇంటెలిజెంట్ కూడా.

కాస్మోపాలిటన్ మేగజైన్ ఆగస్ట్ ఎడిషన్ కవర్ పేజ్ మిలమిల్లాడుతూ కనిపించింది అదితి రావు. కుక్కలంటే తనకు ఎంతో ఇష్టమో.. లగ్జరీగా బతకడం పైనా.. ఫరాన్ అక్తర్ తో కలిపి వస్తున్న రూమర్స్.. ఇలాంటి చాలానే కబుర్లు చెప్పింది కానీ.. అన్నిటికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది కవర్ పేజ్ చూపించిన అందాల గురించే. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో స్కిన్ టైట్ ఔట్ ఫిట్స్ మెరిసిపోయింది. మెడ నుంచి నాభికి కొంచెం పై వరకూ ఏ మాత్రం ఆచ్ఛాదన లేకుండా.. టాప్ గ్యాప్ లోంచి అందాలు చూపించేసింది. మెడలో వేలాడుతున్న ఓ చిన్న చైన్.. దాని లాకెట్.. అమ్మడి అందాన్ని మరింతగా పెంచేసింది. మొత్తానికి కాస్మోపాలిటన్ అందాలను లిమిటెడ్ కోటాలో ఎగ్జిబిషన్ పెట్టేసింది అదితి.

స్కిన్ టోన్ తోనే మూడొంతులు అట్రాక్ట్ చేసేస్తున్న ఈ భామ.. త్వరలో రిలీజ్ కానున్న ఔర్ దేవదాస్ లో చంద్రముఖి పాత్రతో మెప్పిస్తానంటోంది. ఇక తమిళ్ మూవీలో చేసేందుకు మణిరత్నం నుంచి పిలుపు రావడం విశేషం.
Tags:    

Similar News