టాలెంటెడ్ బ్యూటీ ఈసారైనా సక్సెస్ అందుకునేనా..!

Update: 2020-10-12 13:30 GMT
తెలుగు గడ్డపై పుట్టిన అదితి రావు హైదరి 2006లో 'ప్రజాపతి' అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో 'ఢిల్లీ 6' 'యా శాలి జిందగీ' 'రాక్ స్టార్' 'కూబ్సూరత్' 'వాజిర్' 'భూమి' 'పద్మావత్' 'నవాబ్' 'సైకో' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయం కలబోసిన హైదరీ.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన 'సమ్మోహనం' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో వెంటనే తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం 9000kmph' సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీ పరాజయం చెందడంతో టాలీవుడ్ లో అవకాశాలకు దూరమైంది. అయితే ఇంద్రగంటి 'వి' సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. నాని - సుధీర్ బాబు హీరోలుగా నటించిన 'వి' ఇటీవలే ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీతో బ్యాడ్ ల‌క్ కూడా వెంటే వస్తుందనే కామెంట్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్దార్థ హీరోలుగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మహా సముద్రం' లో అదితి రావు హైదరీని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. నటనకు ఆస్కారం ఉన్న ఈ పాత్ర కోసం అనేకమంది హీరోయిన్స్ ని అనుకున్న తర్వాత చివరకు అదితి అయితేనే న్యాయం చేస్తుందని ఆమెను ఫైనలైజ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. హైద‌రీ కూడా మహాసముద్రంలో అల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ఐతే తెలుగులో హైదరీ నటించిన రెండు సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో.. ఈసారైనా ఈ టాలెంటెడ్ హీరోయిన్ మంచి హిట్ అందుకొని లక్కీ బ్యూటీ అనిపించుకోవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News