కేన్స్ 2022లో గంగూభాయిని గుర్తు చేసిన అదితీ?!

Update: 2022-05-21 04:32 GMT
కేన్స్ 2022 ఉత్స‌వాలు  ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈసారి ఉత్స‌వాల‌కు సౌత్ భామ‌లు కొత్త క‌ళ తెచ్చార‌ని చెప్పాలి. ఇందులో ముఖ్యంగా త‌మ‌న్నా - పూజా హెగ్డే వన్నెచిన్నెల రెడ్ కార్పెట్ న‌డ‌క‌లు గుబులు రేపాయి. ఐశ్వ‌ర్యారాయ్  - హీనా ఖాన్ లాంటి బాలీవుడ్ భామ‌లు వేదికపై సంద‌డి చేసినా జ‌నాల దృష్టి ఈ ఇద్ద‌రిపైనే క‌నిపించింది.

ఇప్పుడు వీళ్ల‌కు తోడుగా అదితీరావ్ హైదారీ కేన్స్ 2022లో ప్ర‌త్య‌క్ష‌మైంది. త‌మ‌న్నా - పూజా త‌ర‌హాలోనే అదితీరావుకి ఇది తొలి అవ‌కాశం. దీంతో ఈ బ్యూటీ అదిరే రేంజులో ప్లాన్ చేసుకుని మ‌రీ కేన్స్ లో దిగింది. అక్క‌డ రెడ్ కార్పెట్ ని గ‌డ‌గ‌డ‌లాడించింది. మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే..

కేన్స్ 2022 మే 17న ప్రారంభమైంది. ఈసారి ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్ భారతీయ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో వైభ‌వాన్ని సంత‌రించుకుంది. `మార్చే డు` సినిమా భారతదేశపు మొదటి `కంట్రీ ఆఫ్ హానర్`గా ఎంపికైంది. ఇంత‌లోనే కొన్ని గంట‌ల‌ క్రితం కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ లో హైద‌రాబాదీ మూలాలున్న బ్యూటీ అదితీరావు హైదరీ కూడా అక్క‌డికి చేరుకున్న‌ ప్రముఖుల జాబితాలో చేరారు. నటి దీపికా పదుకొణె ఈ సంవత్సరం జ్యూరీ డ్యూటీలో ఉండగా.. I&B మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ - హీనా ఖాన్- హెల్లీ షా- నవాజుద్దీన్ సిద్ధిఖీ- ఆర్ మాధవన్ స‌హా ప‌లువురు ఇతర భారతీయ ప్రముఖులు ఉన్నారు.

ఇంత‌మంది ప్ర‌ముఖుల న‌డుమ అందాల అదితీరావ్ ఈ సంవత్సరం 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అరంగేట్రం చేసింది. వ‌ర‌ల్డ్ ఫేమస్ కేన్స్ ఈవెంట్ నుండి అదితీ ఫోటోలు  ఇప్పుడు బయటకు వచ్చాయి. సబ్యసాచి డిజైన్ చేసిన ఐవరీ ఆర్గాన్జా చీరలో క‌నిపించింది. ఈ చీర‌కు ఎంబ్రాయిడరీ ఎంతో హ‌త్తుకునేలా క‌నిపిస్తోంది. అదితి రావ్ ఈ లుక్ లో ముగ్ధ‌మ‌నోహ‌రంగా అందంగా కనిపించింది.

ఇది సభ్య‌సాచి లుక్. ఎంపిక చేసుకున్న దుస్తులు.. జ్యువెలరీ బెంగాల్ రాయల్ కలెక్షన్ నుండి ఒక పచ్చ - డైమండ్ చోకర్ తో మెరిసిపోయింది. ఎర్రటి పెదవులతో బోల్డ్ మేకప్ తో అదితీ ఆక‌ర్షించింది.  ఈ ఫెస్టివల్ నుండి త‌న‌ సెకండ్ లుక్‌ చాలా అద్భుతంగా కనిపించింది. కేన్స్ 2022లో అదితి రావ్ హైదరీ అరంగేట్రం వేళ‌ చిక్ కో-ఆర్డ్ సెట్ ని ధరించి రెడ్ కార్పెట్ పై అరంగేట్రం చేసింది. ఫ్రెంచ్ రివేరా నుండి ఫోటోలను పంచుకుని..గ్లోరియస్ ఫ్రెంచ్ రివేరా (sic) అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది.

కేన్స్ 2022కి వెళ్లే ముందు అదితి రావ్ హైదరీ తన అరంగేట్రం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకుంది. ప్ర‌ముఖ మీడియాతో మాట్లాడుతూ అదితీ ఇలా అన్నారు. ``నేను ఇంకా ప్రిపేర్డ్ గా లేను కాబట్టి నేను భయాందోళనలో ఉన్నాను... కానీ నేను చాలా చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను ఆ ఉత్సాహాన్ని కొనసాగించి మొత్తం ప్రక్రియను ఆస్వాధించగలనని ఆశిస్తున్నాను. ఈసారి చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. లాక్ డౌన్ జరిగిన సంవత్సరానికి నేను వెళ్ళవలసి ఉంది. కాబట్టి ఇప్పుడు నేను వెళ్తున్నాను.. ఇది నా మొదటిసారి ప్ర‌య‌త్నం`` అని తెలిపింది.

అయితే అదితీరావ్ లుక్ గంగూభాయిని పోలి ఉంది అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

అదితి రావు హైదరీ కేన్స్ 2022 రెడ్ కార్పెట్  తెల్లటి చీరలో అల్ట్రా గ్లామ్‌గా కనిపించింది. తన చీరను సబ్యసాచి డిజైన్ చేసారని అదితీ తెలిపింది. అయితే అదితి లుక్ గంగూబాయి కతియావాడిలో అలియా భట్ ని గుర్తు చేస్తోంది! అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News