విభిన్న పాత్రలకు విభిన్నమైన చిత్రాలకు నందమూరి బాలకృష్ణ కేరాఫ్ అడ్రస్. ఓ తరం క్రిందట డిఫరెంట్ సబ్జెక్ట్ తో సినిమా చేయాలంటే బాలకృష్ణనే మొదటి ఆప్షన్. ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతాలు ఉంటాయి కానీ.. ఓ మహాద్భుతం సాక్షాత్కారం అయ్యి రేపటితో పాతికేళ్లు పూర్తి కానున్నాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఒకే సినిమాలో చూపించిన సినిమా ఆదిత్య 369. రేపటితో ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోనుంది.
జూలై 18 - 1991న ఆదిత్య 369 చిత్రం విడుదలైంది. బాలయ్య డ్యుయల్ రోల్ లో చేయడం.. ఈ మూవీలో ప్రత్యేకత అయితే.. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ ని తొలిసారిగా తెలుగు తెరకు అందించిన సినిమా ఇది. సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు తెలుగులో ఏ రేంజ్ ఆదరణ ఉంటుందో చూపించాడు బాలయ్య. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రతీ ఫ్రేమ్ ని సూపర్బ్ గా మలిచి.. మూడు కాలాలకు ఎంతో వేరియేషన్ చూపించడం ఆకట్టుకుంటుంది. గతానికి సంబంధించి అయితే శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో బాలకృష్ణ జీవించిన తీరు అసామాన్యం. ముఖ్యంగా ఈ తరంలో ఆయనకు తప్పితే ఆ గెటప్ వేరే ఎవరికీ సెట్ కాదని అనిపించుకున్నారు.
ఫ్యూచర్ ని కూడా ఎంతో భయం గొలిపేలా చూపించడం ఆదిత్య 369 స్పెషాలిటీ. ఇళయరాజా సంగీతం.. వీఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీలు సినిమాకి ప్రాణం పోసేస్తాయి. పాతికేళ్ల క్రితమే 9 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ వసూలు చేసిందంటే.. ఆదిత్య ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో అర్ధమవుతుంది. తన వందో సినిమాని ఈ చిత్రానికి సీక్వెల్ గా సింగీతం దర్శకత్వంలో చేయాలని బాలయ్య అనుకునేందుకు కారణం ఇదే. ఇతర కారణాలతో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ వాయిదా పడ్డా.. త్వరలో ఆదిత్య 999 పేరుతో పాతికేళ్ల క్లాసిక్ కి సీక్వెల్ రావడం ఖాయం అని తెలుస్తోంది.