క్వీన్ కంగన రనౌత్ శత్రువుల్లో ఆదిత్య పాంచోళి ఎపిసోడ్ గురించి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా ఠగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు పై చెయ్యి సాధించడం కోసం కోర్టులో పోరాడుతున్నారు. ఇక క్వీన్ కంగన ఇదివరకూ ఆదిత్య పాంచోళీపై మీటూ వేదికగా దుమ్మెత్తిపోసింది. అతడి వేధింపుల స్వభావం గురించి హైలైట్ చేస్తూ క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తూ మాట్లాడింది. దీంతో ఆదిత్య పాంచోళి కంగన పై పరువునష్టం దావా కేసు వేశారు. ఈ వ్యవహారం అంతకంతకు ముదురుతున్నట్టే కనిపిస్తోంది.
తాజాగా మరోసారి కంగన స్వభావాన్ని తూలనాడుతూ నాపై `ఫేక్ రేప్ కేసు` పెట్టినా పెట్టొచ్చు! పరువు నష్టం దావాని వెనక్కి తీసుకోకపోతే ఏం చేసినా చేస్తుంది!! అంటూ సందేహం వ్యక్తం చేశాడు పాంచోళి. అదే పాయింట్ తో మరో కేసును ముంబై వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేయడం సంచలనమైంది. మూడు రోజుల క్రితమే ఆదిత్య పాంచోళి వెర్సోవా పోలీసులకు ఫిర్యాదును సమర్పించారు. అయితే అతడు ఈ పని చేయడానికి ముందు చాలానే ఎపిసోడ్లు రన్ అయ్యాయి.
అసలింతకీ ఆ ఇద్దరి మధ్యా గొడవేంటి? అంటే ... మే 17న కంగన తరపున లాయర్ రిజ్వాన్ సిద్ధిఖి ఓ ట్వీట్ చేశారు. ``కంగన ఓ పబ్లిక్ వేదిక(మీ టూ)పై ఆరోపించిన తర్వాతనే పాంచోళి తనపై పోలీస్ కేసు వేశారు. పాంచోళి ఇలా చేయడం సరికాదు. తన అమాయకత్వాన్ని కోర్టులో నిరూపించుకోకుండా మా సైలెన్స్ ని మిస్ యూజ్ చేస్తున్నారు. మీడియాకి ఈ నిజానిజాల్ని తెలియజేస్తున్నా. పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. దానిని అయినా అతడు గౌరవించి తీరాలి`` అని ట్వీట్ చేశారు.
ఆసక్తికరంగా తనపైనా.. తన ఫ్యామిలీపైనా బోలెడంత అసత్య ప్రచారం జరిగిందని నటుడు- నిర్మాత అయిన ఆదిత్య పాంచోళి తొలి నుంచి వాపోతున్నారు. ఆ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలు అసత్యం అని నిరూపించేందుకు.. జనవరిలో ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోని పాంచోళి రిలీజ్ చేశారు. ఆ వీడియో పాంచోళినే చిక్కుల్లో నెట్టేలా ఉందని కంగన లాయర్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. కంగన పబ్లిక్ వేదికలపై ఆరోపించాక వచ్చిన వీడియో ఇది. దీనిని ఎవరూ నమ్మరు! పాంచోళి ట్రిక్ ఫలించదు!! అని అతడు వాదన వినిపిస్తున్నారు. పబ్లిక్ సింపథీ కోసం ఇలాంటి పనులు చేసినా అవి వర్కవుట్ కావని పాంచోళికి కంగన లాయర్ వార్నింగ్ ఇవ్వడం చర్చకు వచ్చింది. ప్రస్తుతం ఈ గొడవ పుణ్యమా అని మరోసారి కంగనపై ఆరోపిస్తూ పాంచోళి వింతైన కేసు వేయడం అభిమానుల్లో చర్చకు వచ్చింది.