అందరికీ సన్ స్ట్రోక్ ఆయనకు మాత్రం మేనల్లుడు స్ట్రోక్!
అందుకోసం బ్యాకెండ్ లో ఛోటాకా పనిచేసారు. కానీ సందీప్ ఇంకా స్టార్ ఇంకా కాలేకపోయాడు. కొన్ని సినిమాలు ఆడినా కొన్ని సినిమాల వైఫల్యంతో ఛోటాకె.
ఇండస్ట్రీలో సన్ స్ట్రోక్ అనే మాట సహజంగా వినిపిస్తుంటుంది. స్టార్ హీరోల తనయులు ఇండస్ట్రీకి వచ్చిన క్రమంలో తండ్రులంతా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తనయుడు కూడా తండ్రిలాగే పెద్ద హీరో అవ్వాలని కెరీర్ ని పక్కా గా ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో ప్లాప్ అయితే గనుక ఆ తండ్రులకు సన్ స్ట్రోక్ తప్పదు. తండ్రి సూపర్ స్టార్ అయితే తనయుడేంటి? ఇలా ఫెయిలవుతున్నానే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇది అన్ని పరిశ్రమల్లో ఉన్నదే.
ఇక్కడ రాణించాలంటే తల్లిదండ్రుల సహకారం అన్నది ఎంట్రీ వరకే. ఆ తర్వాత సొంతంగా ట్యాలెంట్ తోనే పైకి రావాల్సి ఉంటుంది. స్టార్ హీరోల కొడుకులంతా సక్సెస్ అవ్వాలని లేదు. కేవలం ప్రతిభ మాత్రమే గొప్ప స్థానానికి తీసుకెళ్తుంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చిరు తనయుడని హీరోగా సక్సెస్ అవ్వలేదు. కష్టపడ్డాడు కాబట్టి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అల్లు అరవింద్ కేవలం నిర్మాత మాత్రమే. కానీ ఆయన తనయుడు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్.
అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. తనని తానే స్టార్ గా మార్చుకున్నాడు. ఇదే కోవలో చిన్న కుమారుడు శిరీష్ కూడా సినిమాల్లోకి వచ్చాడు. కానీ తాను ఇంకా స్టార్ కాలేదు. ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంకా ఇండస్ట్రీలో ఎదిగిన వారెంతో మంది ఉన్నారు. ప్రయత్నించి వైఫల్యం చెదిన వారున్నారు. ఇక ఫేమస్ సినిమాటోగ్రాఫర్ ఛోటా. కె. నాయుడు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు సన్ స్ట్రోక్స్ తగల్లేదు గానీ మేనల్లుడు స్ట్రోక్ లు తగిలా యంటున్నారు.
యంగ్ హీరో సందీప్ కిషన్ ఛోటాకె మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే. ఛోటాకె అల్లుడ్ని తనకున్న పరిచయాలతో ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. హీరోగా చాలా సినిమాలు చేసాడు. అందుకోసం బ్యాకెండ్ లో ఛోటాకా పనిచేసారు. కానీ సందీప్ ఇంకా స్టార్ ఇంకా కాలేకపోయాడు. కొన్ని సినిమాలు ఆడినా కొన్ని సినిమాల వైఫల్యంతో ఛోటాకె. కాస్త నిరుత్సాహ పడినట్లు తెలిపారు.