టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ప్రస్తుతం ధనుష్ హీరోగా 'జగమే తంత్రం' మూవీ రూపొందిస్తున్నాడు. ఆ మూవీ తర్వాత స్టార్ హీరో విక్రమ్ హీరోగా ఓ భారీ మూవీ రూపొందించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. భారీ మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విక్రమ్ తో పాటు ఆయన తనయుడు ధృవ్ కూడా నటిస్తుండటం విశేషం. ఇటీవలే ‘అర్జున్‌రెడ్డి' తమిళ రీమేక్ ‘ఆదిత్యవర్మ’ సినిమాతో ధృవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఒరిజినల్ అంత కాకపోయినా ఓ మోస్తరుగా ఆడింది ఆదిత్యవర్మ. ఇక తండ్రితో కలిసి ధృవ్ సినిమా చేయబోతుండటం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వినూత్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్, ధృవ్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని సమాచారం. తండ్రి కొడుకులు నటిస్తున్న సినిమా కాబట్టి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
లాక్ డౌన్ పూర్తిగా ముగిసాక రెగ్యులర్ షూటింగుకు వెళ్లనున్నారట. ఇది మాఫియా నేపథ్యంలో రూపొందుతుండగా ధృవ్ తన బాడీని తండ్రితో తలబడేందుకు బిల్డ్ చేస్తున్నాడు. అయితే ఇందులో ఒక కీలకమైన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో ఉండగా.. ధృవ్ పాత్ర పాజిటివ్ యాంగిల్లో ఉంటుందట. తండ్రి కొడుకుల మధ్య భారీ ఫైట్స్ కూడా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించనున్నాడు. ఇక ప్రస్తుతం తండ్రితో పోటీ పడటానికి ధృవ్ బాడీని పెంచే పనిలో పడ్డాడు. ఇటీవలే జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ షేర్ చేశారు. కండలు తిరిగిన వీరుడిలా ధృవ్ కనిపించడం విశేషం. ఇక తను సోలో హీరోగా నటించేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే రెండు కథలు నచ్చాయట. అందులో ఒకటి ఫైనల్ చేస్తాడని సమాచారం. చూడాలి మరి తండ్రీకొడుకుల పోరు ఎలా ఉండబోతుందో..!!