కర్మ అనే ప్రయోగాత్మక సినిమాతో హీరోగా, దర్శకుడిగా ఆరంగేట్రం చేశాడు అడివి శేష్. వినాయకుడు ఫేం సాయి కిరణ్ అడివికి కజిన్ అతడు. తొలిసినిమాతోనే ఆకట్టుకున్నా కమర్షియల్ సక్సెస్ రాలేదు. అయితేనేం అతడి లుక్ బావుంది. స్మార్ట్ లుక్, అందుకు తగ్గట్టు ప్రతిభ ఉందని గుర్తించిన పవన్‌కల్యాణ్ పంజా చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం ఇచ్చాడు. అంతే అక్కడ క్లిక్కయ్యాడు. అక్కణ్ణుంచి వెనుతిరిగి చూసే అవసరమే రాలేదు. వరుసగా కిస్, లేడీస్ అండ్ జెంటిల్మన్, రన్ రాజా రన్ వంటి చిత్రాల్లో నటించాడు. ఇప్పటికిప్పుడు ఓ నాలుగైదు సినిమాల్లో నటించేస్తున్నాడు.
టాలీవుడ్‌లోనే అత్యంత క్రేజీయెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న 'బాహుబలి'లో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. 20 నిమిషాల నిడివితో ఉండే ఈ క్యారెక్టర్ తనకి అఛీవ్‌మెంట్ లాంటిదేనని అంటున్నాడు. అలాగే అతడు నటించిన 'క్షణం', 'దొంగాట' చిత్రాలు రిలీజ్‌లకు రెడీగా ఉన్నాయి. దొంగాటలో మంచు లక్ష్మితో కలిసి నటించాడు. పీవీపీ వంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తున్న క్షణంలో అద్భుతమైన పాత్రలో నటించానని చెబుతున్నాడు. దొంగాట చిత్రంలో ఓ ట్విస్టు నా పాత్రను హైలైట్ చేస్తుంది. వెంకట్ అనే కిడ్నాపర్ కథ ఏ కంచికి చేరిందనేది తెరపైనే చూడాలి. క్యారెక్టర్ నచ్చి ఓకే చెప్పానని చెప్పాడు. అదీ సంగతి.