డబుల్ హ్యాట్రిక్ హిట్లు.. మాములు విషయం కాదు..!

Update: 2022-12-04 04:30 GMT
అమెరికాలో పుట్టి పెరిగిన అడివి శేష్ సినిమాల మీద ఆసక్తితో ఇండియా వచ్చేశాడు. మొదట తన కథలను ఎవరు పట్టించుకోలేదు అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కర్మ, కిస్ అనే సినిమాలు తీసినా సరైన గుర్తింపు తెచ్చుకోని అడివి శేష్ పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో విలన్ గా చేశాడు.

ఆ సినిమా కొంత ఐడెంటిటీ రాగా ఆ తర్వాత కూడా సొంతంగా ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. ఇక ఫైనల్ గా అతని టైం క్షణం సినిమాతోనే స్టార్ట్ అయ్యింది. 2016 లో వచ్చిన క్షణం సినిమా అడివి శేష్ టాలెంట్ ని అందరికి పరిచయం చేసింది.

హీరోగా కొత్త పంథాలో కథలు రాస్తూ వస్తున్న అతనికి ఆడియన్స్ కూడా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. క్షణం తర్వాత అమీ తుమీ అంటూ ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేశాడు అడివి శేష్.. ఆ సినిమా కూడా హిట్ అందుకోగా మరోసారి తన స్టైల్ లో గూఢచారి మూవీ చేశాడు ఈ యంగ్ హీరో.

ఆ మూవీతో మరో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. గూఢచారితో అడివి శేష్ తన మార్క్ పర్ఫెక్ట్ గా చూపించగలిగాడు. ఆ తర్వాత ఎవరు మూవీ కూడా అదే హిట్ పంథా కొనసాగించింది. సస్పెన్స్ కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు అడివి శేష్.

రీసెంట్ గా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో మరోసారి తన సత్తా చాటాడు. మహేష్ నిర్మించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకుంది. లేటెస్ట్ గా హిట్ 2 తో తన సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నాడు అడివి శేష్. క్షణం, అమీ తుమీ, గూఢచారి సినిమాల వరుస హిట్లతో హ్యాట్రిక్ అందుకున్న అడివి శేష్ ఆ తర్వాత వచ్చిన ఎవరు, మేజర్, హిట్ 2 లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. పర్ఫెక్ట్ కథ.. దానికి తగిన స్క్రీన్ ప్లే రాసుకుంటే మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అంటున్నారు అడివి శేష్.    

అదే అతని సక్సెస్ ఫార్ములా అని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం డబుల్ హ్యాట్రిక్ తో దూసుకెళ్తున్న అడివి శేష్ ఇదే హిట్ మేనియా తను చేస్తున్న సినిమాలన్నిటిలో కొనసాగించాలని కోరుతున్నారు ఆడియన్స్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News