గూఢచారి గుట్టుపై సోషల్ మీడియా కన్ను

Update: 2018-07-28 13:02 GMT
ఏదైనా కొత్త సినిమా తాలూకు ఛాయలు ఇతర బాషా చిత్రాలలో ఉంటే చాలు సోషల్ మీడియాలో దాని గుట్టు విప్పే నెటిజెన్లకు కొదవే లేదు. ఆ మధ్య ఒక స్టార్ హీరో సినిమా ఫ్రెంచ్ కాపీ అనే రాద్ధాంతం పెరగడానికి కారణం ఈ పోకడే. తాజాగా అడవి శేష్ గూఢచారి కూడా దీని బారిన పడింది. ఇంకా విడుదల కాలేదు కానీ హాలీవుడ్ సినిమాలను బాగా ఫాలో అయ్యేవాళ్ళు జస్ట్ శాంపిల్  చూసే  అసలు గుట్టును విప్పుతున్నారు. ఇటీవలే  విడుదలైన గూఢచారి ట్రైలర్ ఇప్పుడు దీనికి ఊతంగా దొరికింది. తన ఉనికిని దాచుకుని దేశం కోసం స్పై గా మారిన యువకుడి కథతో  గతంలో బోర్న్ పేరుతో బ్లాక్ బస్టర్ సిరీస్ ఒకటి వచ్చింది. అందులో వచ్చిన ప్రతి సినిమా యాక్షన్ మూవీ లవర్స్ ఎప్పటికి మర్చిపోలేరు. గూఢచారిలో వాటి పోలికలు కనిపిస్తూ ఉండటంతో రెండింటికి మెలిక పెట్టి విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ సినిమాల నుచి సీన్స్ తీసుకున్నారని కామెంట్స్ మొదలైపోయాయి.

ఆపరేషన్ త్రినేత్ర పేరుతో ఒక సీక్రెట్ టీమ్-రా లాంటి సంస్థను నడుపుతున్న లేడీ బాస్-హీరోకు ఫ్లాష్ బ్యాక్ లో హృదయాన్ని కదిలించే ఒక ప్రేమ కథ-దానికి గుర్తుగా ఒంటి మీద కనిపించే భాగంలో ఓ టాటూ-స్ఫూర్తినివ్వడానికి తండ్రి లాంటి ఓ మార్గదర్శి ఇవన్నీ బోర్న్ సిరీస్ లో కనిపించేవి. బోర్న్ ఐడెంటిటీ బోర్న్ అల్టిమేటం లాంటివి  చూస్తే ఇవి   గమనించవచ్చు. హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఇంటిమేట్ సీన్లు కూడా వాటివల్లే స్ఫూర్తి చెందినట్టుగా రాసుకోవడం గురించి కూడా అక్కడ హై లైట్ చేస్తున్నారు. హీరో చాకచక్యంగా ఇలా శత్రు దేశ రహస్యాల కోసం తన ప్రాణాలు పణంగా పెట్టడం తెలుగు సాహిత్యంలో మధుబాబు నవలలు షాడో పాత్ర ద్వారా ఏనాడో పరిచయం చేశాయి. కాబట్టి ఏ స్ఫూర్తి ఎక్కడి నుంచి తీసుకున్నా ఫైనల్ గా ప్రేక్షకుడిని మెప్పించారా సరే సరి. లేదా ఇలాంటివి శల్యపరీక్ష చేసి మరీ బయటికి తీస్తారు ఆన్ లైన్ మిత్రులు.
Tags:    

Similar News