క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్న అడవి శేష్ హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది క్షణం మూవీ. తక్కువ బడ్జెట్ లో తీసినా సరైన స్క్రీన్ ప్లే ఉండటం.. ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలెన్నీ స్క్రిప్టులో ఉండేలా చూసుకోవడంతో ఆ సినిమా బంపర్ హిట్టయింది. ఈ సినిమా రీసెంట్ గా తమిళంలో కూడా రీమేక్ అయింది. బాలీవుడ్ లోనూ ఈ మూవీ తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ టైంలో అడవిశేష్ ఓ బాలీవుడ్ మూవీని తెలుగులోకి తెచ్చే పనిలో పడ్డాడు. హిందీలో సూపర్ హిట్టయిన టు స్టేట్స్ సినిమా తెలుగు రీమేక్ లో అడవి శేష్ హీరోగా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఫేమస్ ఇండియన్ రైటర్ చేతన్ భగత్ రాసిన టు స్టేట్స్ నవల ఆధారంగా హిందీలో అదే పేరుతో సినిమా తీశారు. అందులో అర్జున్ కపూర్ - ఆలియా భట్ జంటగా నటించారు. తెలుగు వెర్షన్ లో హీరోయిన్ గా ఒకనాటి హీరోయిన్ కుమార్తెను తీసుకునే ఆలోచన లో సినిమా టీం ఉందని తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ వెంకట్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మించనున్నారు.
టు స్టేట్స్ ఒరిజినల్ కథలో ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి.. వాళ్ల తల్లిదండ్రులను పెళ్లికి ఎలా ఒప్పించగలిగారనే కథతో నడుస్తుంది. తెలుగుకు వచ్చేసరికి హీరోయిన్ ను నార్త్ ఇండియన్ చేస్తూ స్క్రిప్ట్ లో మార్పు చేర్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పనిలోనూ అడవి శేష్ తన వంతు సాయం చేస్తున్నాడని చిత్ర బృందంలోని సభ్యుడొకరు తెలిపారు. గతంలో ఈ సినిమాకు నాగ చైతన్యను హీరో అనుకున్నారు కాని.. ఇప్పుడు మాత్రం ఈ రెండు రాష్ట్రాల కథ కోసం శేష్ రెడీ అవుతున్నాడు.