యంగ్ హీరో అడవి శేష్ అడపా దడపా చిత్రాలు చేస్తూ ఉన్నా కూడా మంచి విజయాలను దక్కించుకుంటూ పోతున్నాడు. ఈయన ఇటీవల గూఢచారి చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం గూఢచారికి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడని.. అలాగే మరో రెండు సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడిగా కూడా మంచి ప్రతిభ కనబర్చిన అడవి శేష్ ప్రస్తుతం నటుడిగా మాత్రమే కొనసాగుతున్నాడు.
ఈయన చేసే ప్రతి సినిమా కథ విషయంలో కూడా తుది నిర్ణయం ఈయనే తీసుకుంటాడనే టాక్ ఉంది. కథ విషయంలో మార్పులు చేర్పులు చేయడంతో పాటు స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శకుడికి సలహాలు ఇస్తాడనే పుకార్లు ఉన్నాయి. ఇక సినిమా మేకింగ్ సమయంలో కూడా అడవి శేష్ ఫింగరింగ్ ఉంటుందనే పుకార్లు చాలా కాలం నుండే వస్తున్నాయి. తాజాగా ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.
ఇటీవల తనపై వస్తున్న పుకార్లపై అడవి శేష్ స్పందిస్తూ... నేను ఎప్పుడు దర్శకుల పనిలో జోక్యం చేసుకోను. సలహాలు ఇస్తాను కాని తుది నిర్ణయం వారిదే.. నా సినిమాల సక్సెస్ పూర్తి క్రెడిట్ దర్శకులదే అన్నాడు. దర్శకుడిగా ఆఫర్లు వస్తున్నా కూడా ఈయన మాత్రం నటుడిగానే కొనసాగుతున్నాడు. తన సినిమా కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే అడవి శేష్ త్వరలో మరో హిట్ చిత్రంతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడట.