అడివి శేష్ మ‌రీ ఫూలిష్ గా ఆలోచించాడా?

Update: 2022-12-03 17:30 GMT
టాలీవుడ్ లో వున్న యంగ్  హీరోల్లో అడివి శేష్ శైలి ప్ర‌త్యేకం అనే విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక‌మైన క‌థ‌ల‌ని ఎంచుకుంటూ హీరోగా, రైట‌ర్ గానూ త‌న‌దైన ముద్ర వేస్తూ వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటూ ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. త‌న స్థాయి యంగ్ హీరోల‌కు ట‌ఫ్ ఫైట్ ఇస్తున్న అడివి శేస్ `క్ష‌ణం` నుంచి హీరోగా, రైట‌ర్ గా స‌క్సెస్ అవుతూ వ‌రుప‌స విజ‌యాల‌ని సొంతం చేసుకుంటున్నాడు. అడివి శేష్ కు రీసెంట్ గా విడుద‌లైన `మేజ‌ర్‌` మూవీ పాన్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ని తెచ్చి పెట్టింది.

ఈ మూవీతో ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీతో పాటు మంచి మార్కెట్ ని కూడా ద‌క్కించుకోవ‌డం విశేషం. సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా 2008లో జ‌రిగిన ముంబై టెర్ర‌ర్ ఎటాక్ నేప‌థ్యంలో ఈ మూవీని శ‌శికిర‌ణ్ తిక్క తెర‌కెక్కించాడు. ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌డ‌మే కాకుండా భారీ స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని కూడా రాబ‌ట్టి సంచ‌ల‌నంగా మారింది. ఇదిలా వుంటే అడివి శేష్ న‌టించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ సైకో థ్రిల్ల‌ర్ `హిట్ 2` ఈ శుక్ర‌వారం విడుద‌లైంది.

ఈ సంద‌ర్భంగా ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించాడు అడివి శేష్‌. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిర విష‌యాల్ని వెల్ల‌డించారు. `మేజ‌ర్` మూవీ త‌రువాత త‌న‌ప‌కు బాలీవుడ్ నుంచి బ‌డా ప్రొడక్ష‌న్ కంప‌నీల నుంచి ఎనిమిది క్రేజీ ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని, అయితే తాను వాటిని సున్నితంగా తిర‌స్క‌రించాన‌న్నాడు. నాకు ఇప్ప‌టికే క‌మిట్ మెంట్ లు వున్నందుకు బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఎనిమిది ఆఫ‌ర్ల‌ని సున్నితంగా తిర‌స్క‌రించాన‌న్నాడు.

అయితే త్వ‌ర‌లో తాను చేస్తున్న నాలుగు సినిమాలు మాత్రం ఖ‌చ్చితంగా హిందీలో రిలీజ్ అవుతాయ‌ని, బాలీవుడ్ సినిమాలు వ‌దులుకున్నందుకు నాకు ఏమీ బాధ‌లేద‌న్నాడు. అడివి శేష్ హీరోగా న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `మేజ‌ర్‌`. ఈ మూవీ త‌రువాత పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో న‌టించే అవ‌కాశం అడివి శేష్ లాంటి హీరోల‌కు ఎప్ప‌టికో కానీ రాదు.

అలాంటి ఆఫ‌ర్లు వెతుక్కుంటూ రావ‌డం.. వాటిని తిర‌స్క‌రించ‌డం అడివి శేష్ చేసిన ఫూలిష్ ఆలోచ‌న అని కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు. అడివి శేష్ `హిట్ 2` త‌రువాత `గూఢ‌చారి 2`లో న‌టించ‌బోతున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News