హాస్పిటల్ లో ఉన్న అడవి శేష్ .. ఏమైందంటే

Update: 2021-09-20 08:50 GMT
అడవి శేష్..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో ఒకరు. అలాగే మంచి కాన్సెప్ట్ ఉన్న కథలని ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అడవి శేష్ సినిమా అంటే ఎదో ఒక ప్రత్యేకత ఉంటుందనే అభిప్రాయం అందరిలో నెలకొంది. ఇక ప్రస్తుతం అడవి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా అడివి శేష్ మొదటసారిగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

ఇక ఇదిలా ఉంటే .. మరోవైపు, గతవారం అడివి శేష్‌కు డెంగ్యూ సోకినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.శరీరంలో ప్లేట్‌ లెట్స్ అకస్మాత్తుగా పడిపోవడంతో, అతను సెప్టెంబర్ 18 న ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం హీరో అడవి శేష్ ను డాక్టర్లు చాలా దగ్గరగా ఉంటూ పరీక్షిస్తున్నారు. అడవి శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అడవి శేష్ కి డెంగ్యూ సోకిందని తెలియడంతో అయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.




Tags:    

Similar News