బూతులో హాలీవుడ్ ని దాటేస్తున్నారు

Update: 2016-01-18 15:30 GMT
బూతు కంటెంట్ అంటే.. ఒకప్పుడు మళయాళ సినిమాలు గుర్తొచ్చేవి. సీ గ్రేడ్ - డీ గ్రేడ్ సినిమాలంటూ వీటికి సెపరేట్ గా జోనర్ - థియేటర్లు మెయింటెయిన్ చేసేవారు. అయితే, హాలీవుడ్ లో ఎప్పటినుంచో ఈ బూతు కంటెంట్ కి డిమాండ్ ఉంది. కానీ రీసెంట్ టైమ్స్ లో స్ట్రెయిట్ సినిమాలకు పోటీ ఇచ్చే స్థాయికి బూతును చేర్చేశారు బాలీవుడ్ నిర్మాతలు.

ఇప్పుడు హాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే బూతు కంటెంట్ ఆధారంగా ఎక్కువగా సినిమాలు ఎక్కువ వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రాబోయే రెండు నెలల్లో 3 బూతు సినిమాలు ప్రేక్షకులపై దాడి చేయబోతున్నాయి. మొదటగ ఈనెల 22న క్యా కూల్ హై హమ్ 3 రిలీజ్ కానుంది. తుషార్ కపూర్. ఆఫ్తాబ్ శివదాసానిలు ఇందులో హీరోలు. పోర్న్ స్టార్స్ అంటూ ఇప్పటికే హంగామా చేసేస్తున్నారు. ఆ తర్వాత వారమే మరో మూవీ రిలీజ్ కానుంది. మస్తీ జాదే పేరుతో సన్నీలియోన్ డబుల్ యాక్షన్ చేసింది ఇందులో. తుషార్ కపూర్ హీరో. సన్నీకి ఒక రోల్ ఇస్తేనే, సెక్స్ కంటెంట్ తో నింపేస్తుంది. అలాంటిది ఆ పోర్న్ భామతో రెండు పాత్రలు చేయించడంతోనే, నిర్మాతల ఇంటెన్షన్ అర్ధమవుతుంది.

ఇక అడల్ట్ కంటెంట్ సినిమాల్లో కొత్త చరిత్ర సృష్టించిన గ్రాండ్ మస్తీ సిరీస్ లో కొత్త మూవీ గ్రేట్ గ్రాండ్ మస్తీ. రితేష్ దేశ్ ముఖ్ - అఫ్తాబ్ శివదాసాని - వివేక్ ఒబెరాయ్ లు హీరోగా నటించిన ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ కానుంది. ఈ బూతు చిత్రాలన్నీ కాసులు కొల్లగొట్టడం ఖాయమనే అంచనా ఉంది. వీటి కారణంగా స్ట్రెయిట్ సినిమాల విడుదల డేట్స్ కి ఇబ్బంది ఎదురవుతోందంటే.. వీటి హవా ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.
Tags:    

Similar News