టాలీవుడ్ గత పది రోజులుగా అజ్ఞాతవాసి మ్యానియాతో ఊగిపోయింది. సహజంగా శుక్రవారం సినిమాలు వస్తాయి కానీ.. పవర్ స్టార్ మూవీని బుధవారానికే షెడ్యూల్ చేయడంతో.. గత వారం ఏ సినిమాను రిలీజ్ చేసే సాహసం కూడా చేయలేదు మేకర్స్. అయితే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ వచ్చేసింది.
మొదటి షో నుంచి అజ్ఞాతవాసికి టాక్ ప్రోత్సాహకరంగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్లుగా జరగడం.. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్.. సెలవలు కలిసిరావడంతో.. మొదటి రెండు రోజులు కలెక్షన్స్ కు ఢోకా ఉండకపోవచ్చు. అయితే.. సంక్రాంతి పండుగను పూర్తిగా క్యాష్ చేసుకోవడం మాత్రం కష్టమే కావచ్చని అంటున్నారు. మరి ఈ సిట్యుయేషన్ ను ఎవరు ఉపయోగించుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికే మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో డబ్బింగ్ సినిమా గ్యాంగ్ ను పక్కన పెడితే.. బాలకృష్ణ నటించిన జైసింహా.. రాజ్ తరుణ్ మూవీ రంగుల రాట్నం ఉన్నాయి.
బాలయ్య జైసింహా పక్కా మాస్ మూవీ కాగా.. ఫ్యాన్స్ ను ఏమాత్రం మెప్పించగలిగినా.. సెలవుల సీజన్ అడ్వాంటేజ్ తో.. ఈజీగా వసూళ్లను సాధించేయచ్చు. మరోవైపు చిన్నసినిమాగా వస్తున్న రాజ్ తరుణ్ మూవీ రంగుల రాట్నంకు కూడా.. అజ్ఞాతవాసి టాక్ తేడాగా ఉండడం కలిసొచ్చే విషయమే. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తే.. ఈ యంగ్ హీరో పాస్ అయిపోవడం తేలికే.