అక్కడ మాత్రం నితినే కింగ్

Update: 2017-08-10 11:02 GMT
ఈ శుక్రవారం రిలీజవుతున్న మూడు సినిమాల మీదా మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు సినిమాలూ మంచి అంచనాల మధ్య రిలీజవుతున్నాయి. మూడింటికీ వాటి వాటి స్థాయిలో థియేటర్లు బాగానే దక్కినట్లు కనిపిస్తోంది. ఎ సెంటర్లలో లై.. నేనే రాజు నేనే మంత్రి సినిమాలపై ఎక్కువ హైప్ కనిపిస్తుండగా.. బోయపాటికి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ కారణంగా బి-సి సెంటర్లలో ‘జయ జానకి నాయక’కే జనాలు పట్టం కట్టే పరిస్థితి కనిపిస్తోంది. బుకింగ్స్ కూడా ఇందుకు తగ్గట్లే కనిపిస్తున్నాయి. మరి టాక్ ఎలా వస్తుందో చూడాలి.

తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న అమెరికా విషయానికి వస్తే.. అక్కడ ‘లై’కే ఎక్కువ హైప్ ఉంది. బోయపాటి సినిమాలకు మామూలుగానే అక్కడ అంత బజ్ ఉండదు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో చేసినా ‘సరైనోడు’కు అక్కడ పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. ‘జయ జానకి నాయక’ విషయంలోనూ హైప్ తక్కువే ఉంది. రానా సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ పరిస్థితి దీని కంటే మెరుగ్గా ఉంది. ఐతే అక్కడ ఎక్కువ అంచనాలున్నది మాత్రం ‘లై’ మీదే.

యుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టుకు తగ్గ క్లాస్ రొమాంటిక్.. థ్రిల్లర్ లాగా కనిపిస్తుండటం ‘లై’కి కలిసొస్తున్న అంశం. అక్కడి ప్రేక్షకులు సున్నితమైన ప్రేమకథల్ని ఇష్టపడతారు. అలాగే థ్రిల్లర్ సినిమాలకూ పట్టం కడతారు. ఈ రెండూ ‘లై’లో ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడి ప్రేక్షకులకు నప్పే క్లాస్ అంశాలు ఈ సినిమాలు ఉన్నట్లున్నాయి. పైగా ఈ చిత్రంలో మెజారిటీ పార్ట్ అమెరికాలో నేపథ్యంలోనే సాగడం కూడా ప్లస్ పాయింట్. నిర్మాత అనిల్ సుంకరకు అమెరికాలో ఉన్న పట్టుతో తన సినిమాకు 150 దాకా స్క్రీన్లు ఇప్పించుకున్నాడు. ప్రిమియర్లు కూడా భారీగానే ప్లాన్ చేశాడు. తెలుగు రాష్ట్రాల సంగతెలా ఉన్నా.. అమెరికా వరకు ‘లై’ మిగతా రెండు సినిమాలపై ఆధిపత్యం చలాయిస్తుందని భావిస్తున్నారు.
Tags:    

Similar News