ఆఫ్రికా సఫారీ... మొన్న చరణ్ ఫ్యామిలీ ఇప్పుడు బన్నీ ఫ్యామిలీ

Update: 2022-11-09 05:30 GMT
కొన్ని రోజుల క్రితం మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌ ఆఫ్రికా లో సఫారీ చేస్తూ కనిపించిన విషయం తెల్సిందే. ఆ సందర్భంగా చరణ్ తో పాటు ఉపాసన కూడా ఉన్నారు. ఇద్దరు కూడా సఫారీ చేస్తూ వైల్డ్‌ ఫొటో గ్రఫీ తో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.

రామ్‌ చరణ్ మరియు ఉపాసన యొక్క ఆఫ్రికా సఫారీ ఫోటోలు మరియు వీడియో లు ఎంతగా వైరల్‌ అయ్యాయో తెల్సిందే.

ఆ ఫోటోలు మరియు వీడియోలు ఇంకా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ సమయంలోనే అల్లు అర్జున్‌ కుటుంబ సమేతంగా ఆఫ్రికా కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

పుష్ప 2 సినిమా యొక్క రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. దాంతో కాస్త రిలాక్స్ అవ్వాలనే ఉద్దేశ్యంతో సౌత్‌ ఆఫ్రికా కి అల్లు అర్జున్ మరియు స్నేహా రెడ్డి లు వెళ్లారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

చరణ్ మరియు ఉపాసన వెళ్లినట్లుగానే బన్నీ మరియు స్నేహా లు సఫారీ ని ఎంజాయ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరు ఇద్దరు కూడా సఫారీకి చెందిన ఫోటోలు మరియు వీడియోలు కూడా షేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి రామ్‌ చరణ్ మరియు ఉపాసన ల తర్వాత బన్నీ మరియు స్నేహాలు ఆఫ్రికా సఫారీ కి వెళ్లడం గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎన్నో దేశాలకు హాలిడే ట్రిప్ కు వెళ్లిన బన్నీ స్నేహా లు ఇప్పుడు ఆఫ్రికా వెళ్లారు. అక్కడ కనీసం వారం నుండి పది రోజులు ఉండే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News