'పాపులారిటీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి'.. ఈడీ విచారణ అనంతరం VD..!
'లైగర్' చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ను అధికారులు బుధవారం విచారించారు. అయితే తాజాగా విచారణ పూర్తయింది. ఈరోజు ఉదయం ఈడీ ఆఫీస్ కు వచ్చిన విజయ్ ను.. అధికారులు దాదాపు 11 గంటల పాటు ప్రశ్నించారని తెలుస్తోంది. విచారణ అనంతరం VD మీడియాతో మాట్లాడారు.
''ఉదయం ఆఫీస్ కు వచ్చా. కొన్ని విషయాల్లో క్లారిఫికేషన్ అడిగారు. మంచిగా వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ ఇచ్చా. మీరు ఇంతగా ప్రేమిస్తారు కాబట్టి.. ఆ ప్రేమతో వచ్చే పాపులారిటీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఇది లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్'' అని విజయ్ దేవరకొండ అన్నారు.
''నన్ను విచారణకు పిలిచారు. నా బాధ్యతగా వచ్చి సమాధానాలు చెప్పా. ఇదే నేను చెప్పగలను. ఇంతకంటే నేనేమైనా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అలిగేషన్స్ ఏమీ లేవు.. కొన్ని క్లారిఫికేషన్స్ అంతే'' అని విజయ్ దేవరకొండ తెలిపారు. ఈరోజుతో విచారణ పూర్తయ్యిందని.. అధికారులు మళ్ళీ రమ్మని తనకు చెప్పలేదని విజయ్ పేర్కొన్నారు.
కాగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' సినిమా లావాదేవీల విషయంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు రావడంతో.. ఈడీ రంగంలోకి దిగింది. సినిమా నిర్మాణంలో విదేశీ పెట్టుబడులు ఉన్నాయని ఆరోపణలపై చిత్ర బృందాన్ని అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే డైరెక్ట పూరి జగన్నాథ్ మరియు నిర్మాత ఛార్మి కౌర్ లను అధికారులు విచారించారు.
ఈ క్రమంలో ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించారు. దాదాపు 11 గంటల పాటు సాగిన ఈ విచారణలో పలు కోణాల్లో అధికారులు విజయ్ ను ప్రశ్నించారని తెలుస్తోంది. సినిమా పెట్టుబడుల గురించి.. రెమ్యునరేషన్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ను సైతం ఈడీ అధికారులు పరిశీలించినట్లుగా చెబుతున్నారు. PMLA సెక్షన్ 50 కింద VD స్టేటమెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.
బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికే 'లైగర్' సినిమాని రూపొందించారంటూ ఈడీకి ఫిర్యాదు చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీని చెందిన బక్క జుడ్సన్ ఇటీవల స్వయంగా తెలిపారు. దీంతో విదేశీ పెట్టుబడుల చట్టాల ఉల్లంగించారనే అనుమానంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి పూరి - చార్మీ - విజయ్ దేవరకొండలకి నోటీసులు జారీ చేసి విచారించారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవరిని విచారిస్తారో చూడాలి.