టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో సినిమాల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ వసూళ్లను టార్గెట్ గా పెట్టుకొని స్టార్ హీరోలందరూ పెద్ద పండక్కి రావాలని చూస్తుంటారు. దశాబ్దాల నుంచి సంక్రాంతి పండుగ సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల సినిమాలు బరిలో దిగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ ప్రభావం కారణంగా స్టార్ హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. కానీ ఈసారి సంక్రాంతి మాత్రం టాలీవుడ్ లో రసవత్తరంగా ఉండబోతోందని సంకేతాలు వస్తున్నాయి.
2022 సంక్రాంతి బెర్తుల కోసం ఇప్పటికే రెండు సినిమాలు కర్చీఫ్ లు వేశారు. గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సరిలేరు అనిపించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈసారి అందరి కంటే ముందుగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
లేటెస్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా '#PSPKRana' సినిమాతో రేసులోకి వచ్చేసాడు. రానా దగ్గుబాటి తో కలిసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు సంక్రాంతి పండుగ కోసం మరో పందెం పుంజును రెడీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని ఫెస్టివల్ సీజన్ లో తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ గురువారానికి పూర్తి అయింది. ఈ క్రమంలో మరో మూడు రోజుల్లో అఫిషియల్ అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' నుంచి రాబోతున్న అప్డేట్ లో సంక్రాంతి రిలీజ్ గురించి ప్రకటన ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలు పెట్టిన ప్రభాస్ వింటేజ్ లవ్ డ్రామా.. వివిధ కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు రావడంతో జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నారు. అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడటంతో షూట్ డిలే అవడం.. విడుదల వాయిదా పడటం జరిగిపోయాయి.
అయితే ఇప్పుడు 'రాధే శ్యామ్' మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి అన్ని భాషల్లోను పరిస్థితులు చూసుకొని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. 'ఆర్ ఆర్ ఆర్' 'అన్నాత్తే' 'పుష్ప 1' 'కేజీయఫ్ 2' వంటి సినిమాలతో పాటుగా పలు హిందీ చిత్రాల సినిమాల విడుదల తేదీలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రభాస్ సినిమా సంక్రాంతి కి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అప్పుడు పోటీ ఉన్నప్పటికీ సంక్రాంతి సీజన్ లో రెండు మూడు పెద్ద చిత్రాలు వచ్చినా వసూళ్లకు ఢోకా ఉండదు.
ఒకవేళ 'రాధే శ్యామ్' కూడా వార్ లో దిగడానికి రెడీ అయితే మాత్రం టాలీవుడ్ లో కొన్నేళ్ల తర్వాత వచ్చే బిగ్గెస్ట్ సంక్రాంతి సినిమా పండుగ ఇదే అవుతుంది. మరి చిత్ర నిర్మాతలు రాబోయే అప్డేట్ తో దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే సంక్రాంతి స్లాట్ కోసం 'ఎఫ్ 3' కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన మేకర్స్.. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో ఫ్రాంచైజీ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. వీటి మధ్యలో ఛాన్స్ దొరికితే దూరాలని తమిళ సినిమా 'బీస్ట్' కూడా రెడీగా ఉంది. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.