అక్కినేని సమంత నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ ఇటీవలే విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంటోంది. దర్శకద్వయం రాజ్ - డీకే మొదటి సీజన్ కు ధీటుగా ఈ సీజన్-2 ని కూడా రూపొందించారు. 9 ఎపిసోడ్స్ కూడా వేటికవే ప్రత్యేకంగా.. ఉత్కంఠ రేకిత్తించేలా ఉన్నాయి. టాస్క్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారిగా మనోజ్ బాజ్ పాయ్.. రాజీ అలియాస్ రాజ్యలక్ష్మిగా సమంత ఆకట్టుకున్నారు. నేషనల్ వైడ్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సిరీస్ కి ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఈ సీజన్ చూసినవాళ్ళు అందరూ ఇప్పుడు 'ఫ్యామిలీ మ్యాన్ 3' గురించి ఆలోచిస్తున్నారు.
‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్-2 ముగింపులోనే మూడో సీజన్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఫస్ట్ సీజన్ లో పాకిస్థాన్ టెర్రరిజం.. రెండో సీజన్ లో తమిళ రెబల్స్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. మూడో సీజన్ లో చైనా దేశంతో ఇండియాకు పొంచివున్న ముప్పు గురించి చూపించబోతున్నారు. సీజన్2 చివర్లో ఓ చైనా వ్యక్తిని చూపిస్తూ భారత్ పై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు చూపించారు. చైనా వ్యక్తి తన ల్యాప్ టాప్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తితో చాట్ చేస్తూ ‘ప్రాజెక్ట్ గువాన్ యు’ ముందుకు తీసుకెళ్దామా అని అడుగగా.. 'ప్రాజెక్ట్ గువాన్ యు ముందుకు వెళ్లండి సోల్జర్' అని సమాధానం వస్తుంది. దీనిని బట్టి ఈసారి శ్రీకాంత్ తివారీ అండ్ టాస్క్ టీమ్ చైనా ను ఎదుర్కోబోతోందని అర్థం అవుతోంది.
'ఫ్యామిలీ మ్యాన్' తొలి భాగంలో ఇండియా-పాకిస్తాన్.. సీజన్-2 లో శ్రీలంక రాజకీయ, చారిత్రక అంశాలు మరియు ఇండియా-శ్రీలంక దేశాల మధ్య సంబంధాల గురించి టచ్ చేశారు రాజ్-డీకే. రాబోయే సీజన్-3 లో ఇండియా-చైనా మధ్య రాజకీయ ద్వైపాక్షిక సంబంధాలను చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగలేవు. కరోనా వైరస్ పుట్టుక తర్వాత చైనా మీద ప్రపంచ దేశాలన్నీ కోపంగా ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దు వద్ద మన దేశంతో చైనా కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 'ఫ్యామిలీ మ్యాన్ 3' లో చైనాకు వ్యతిరేకంగా గళం విప్పటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈసారి కథ ఈశాన్య భారతదేశంలో నడుస్తుందని చెప్పవచ్చు. మ్మొత్తం మీద 'ఫ్యామిలీ మ్యాన్' రూపకర్తలు ప్రస్తుత పరిస్థితులను తీసుకొని మూడో సీజన్ కు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది.