ప్రభాస్‌ - మహేష్‌ పుకార్లు.. కన్నడ మీడియా క్లారిటీ

Update: 2019-03-09 17:00 GMT
కన్నడ సినిమాల గురించి, కన్నడ నటీనటులు టెక్నీషియన్స్‌ గురించి టాలీవుడ్‌ లేదా కోలీవుడ్‌ వారు పెద్దగా మాట్లాడుకునే సందర్బాలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కన్నడ దర్శకులకు తెలుగు స్టార్‌ హీరోలు ఎవరు కూడా ఛాన్స్‌ ఇవ్వరు. ఎందుకంటే కన్నడ దర్శకులు తమ స్థాయి సినిమాలు తీయలేరు అనేది మన స్టార్‌ హీరోల అభిప్రాయం. అయితే ఆ అభిప్రాయం గతం, ఇప్పుడు కేజీఎఫ్‌ చిత్రం వచ్చిన తర్వాత ఆ కన్నడ దర్శకుడిపై అందరి దృష్టి పడింది. కేజీఎఫ్‌ చిత్రాన్ని మినీ బాహుబలి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నిల్‌ గురించి మన స్టార్‌ హీరోలు వాకబు చేయడం మొదలు పెట్టారు.

మన హీరోలు ఆ దర్శకుడి గురించి వాకబు చేయడం మొదలు పెట్టారో లేదో వెంటనే ఆ దర్శకుడితో మనవారు సినిమా చేయబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలు పెట్టాయి. మొదట ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నిల్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని తేలిన వెంటనే మహేష్‌ బాబు భార్య నమ్రత స్వయంగా బెంగళూరు వెళ్లి కథ చర్చలు చేసిందని, మహేష్‌ బాబు కోసం ప్రశాంత్‌ నిల్‌ ను బుక్‌ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

ప్రశాంత్‌ నిల్‌ టాలీవుడ్‌ లో సినిమా చేయబోతున్నట్లుగా జాతీయ మీడియాలో సైతం కథనాలు రావడంతో తాజాగా ఒక కన్నడ మీడియా సంస్థ ప్రశాంత్‌ నిల్‌ వద్ద క్లారిటీ తీసుకుందట. ఆ మీడియా సంస్థకు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతానికి తాను కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 పనిలోనే బిజీగా ఉన్నాను. మరే ప్రాజెక్ట్‌ గురించి కూడా నేను ఆలోచించడం లేదని క్లారిటీ ఇచ్చేశాడట. కన్నడ మీడియాలో ఈ విషయమై క్లారిటీ రావడంతో ప్రభాస్‌, మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News