'ఏజెంట్' న్యూ లుక్ నెట్టింట‌ వైర‌ల్!

Update: 2022-04-18 06:28 GMT
అక్కినేని వార‌సుడు అఖిల్ క‌థానాయ‌కుడిగా స్టైలిష్ మేక‌ర్ సురెంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో'ఏజెంట్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏజెంట్ లో అఖిల్ లుక్ ఇప్ప‌టికే సినిమాకి కావాల్సినంత ప్ర‌చారాన్ని తెచ్చి పెట్టింది. సిక్స్ ప్యాక్ లో అఖిల్ లుక్ సూప‌ర్బ్ అంటూ మంచి కామెంట్లు ప‌డ్డాయి. ఇదొక స్పై థ్రిల్ల‌ర్ . వైజాగ్ పోర్టులో వెలుగు చూసిన‌ హానీట్రాప్ నేప‌థ్య‌మ‌ని  జోరుగా ప్ర‌చారం సాగుతోంది.  కీల‌క స‌న్నివేశాల్ని  నెల్లూరు జిల్లాలోని కృష్ణ‌ప‌ట్నం..విశాఖ ప‌ట్నం పోర్టులో షూట్ చేసారు.

హైద‌రాబాద్ స‌హా యూర‌ప్ లోని  బుడాఫెస్ట్ లో కొంత భాగం షూటింగ్ పూర్త‌యింది. దీంతో మెజార్టీ పార్ట్ దాదాపు పూర్ర‌త‌యింది. ప్ర‌స్తుతం కొత్త షెడ్యూల్ రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

తాజాగా అఖిల్ న్యూలుక్ ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. జిమ్ములో వ‌ర్కౌట్లు చేస్తున్న ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. వాకింగ్ జాకెట్ ధ‌రించి జిమ్ లో ట్రెడ్మిల్ పై కూల్ గా వాక్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు. లుక్ ప‌రంగ‌నూ మార్పులు క‌నిపిస్తున్నాయి. గుబురుగా ఉండే  బీయ‌ర్డ్ కాస్త  ట్రిమ్ చేసిన లుక్ లో క‌నిపిస్తున్నాడు. కొన్ని  స్నాప్స్ లో న‌వ్వుతు హైలైట్ అవుతున్నాడు.

ప్రస్తుతం ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. అభిమానులు అఖిల్ న్యూ లుక్ చూసి మురిసిపోతున్నారు. ఇక 'ఏజెంట్' పై అఖిల్ భారీ అశ‌లు పెట్టుకున్నాడు. సినిమాకి వ‌స్తోన్న పాజిటివ్ బ‌జ్ తో పాటు సురేంద‌ర్ రెడ్డి 'సైరా న‌రిసింహారెడ్డి' త‌ర్వాత తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. సూరి గ‌త ట్రాక్ రికార్డ్...అఖిల్ బ్యాక్ టూ బ్యాక్  స‌క్సెస్ కిక్ న‌డుమ 'ఏజెంట్' రిలీజ్ అవుతుండ‌టంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

అలాగే అఖిల్ ఇక‌పై సినిమాల స్పీడ్ కూడా పెంచే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ స‌క్సెస్ లేమితో బాధ‌ప‌డిన అఖిల్ కి  అది వ‌రించింది కాబ‌ట్టి న‌చ్చిన ప్రాజెక్ట్ ల్ని  లైనప్ లోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంది.

ఏజెంట్ స‌క్సెస్ అయితే అటుపై అఖిల్ పాన్ ఇండియా కేట‌గిరిపైనా దృష్టి పెట్ట‌నున్నాన‌ర‌ని సోర్సెస్ చెబుతున్నాయి. లుక్ ప‌రంగా అఖిల్ కి తిరిగుండ‌దు. ప్రామిసింగ్ న‌టుడు. స‌రైన కంటెంట్ లో  అఖిల్ ఎలివేట్ అవ్వ‌గ‌ల్గితే అక్కినేని ఇంట‌పేరు  మారు మ్రోగిపోవ‌డం ఖాయం.  అఖిల్ 'ఏజెంట్' ని పాన్ ఇండియా లో రిలీజ్ చేసే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News