ఒకప్పుడు స్టార్ హీరోలకు మాత్రమే ఓవర్సీస్ అనుకూలం. కానీ ఇప్పుడు సీన్ మారింది. మ్యాటర్ ఉంటే చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేదు. ఒక రకంగా నవతరం హీరోలకు ఓవర్సీస్ కామధేనువుగా మారింది. అంతగా ఊరూ పేరూ తెలియని హీరోలకు విదేశీ బిజినెస్ పెద్ద రేంజులో కలిసొస్తోంది. మారిన ట్రెండ్ ఇదని చెప్పొచ్చు. ఈ పరిణామం కొత్తది.. వినోద పరిశ్రమకు మేలైనది.
ఆ కోవలోనే నవతరం హీరో నవీన్ పోలిశెట్టి నటించిన `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` బిజినెస్ వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ మెజారిటీ పార్ట్ పూర్తయిందని తెలుస్తోంది. ఏపీ- తెలంగాణ సహా ఓవర్సీస్ లో బిజినెస్ పూర్తయింది. అన్నిచోట్లా డీసెంట్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ వరకూ రూ.60లక్షల మేర రైట్స్ పలికాయని తెలుస్తోంది. నవీన్ కొత్త హీరో. అయినా బిజినెస్ ఆ స్థాయి పలికిందంటే ఆశ్చర్యకరమే. ఇది సినిమాపైనా పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహించారు. మళ్లీ రావా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. శ్రుతి శర్మ నాయిక. జూన్ 21న సినిమా రిలీజవుతోంది.
అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వేగంగా పూర్తవ్వడానికి కారణం .. తొలి నుంచి ఏజెంట్ ఆత్రేయ టీమ్ ఎంచుకున్న నవ్యపంథా పబ్లిసిటీ అనే చెప్పొచ్చు. పోస్టర్ తోనే క్యూరియాసిటీని పెంచగలిగారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ బిజినెస్ కి సాయమైంది. క్రేజీగా ఈ నెల 21న రిలీజవుతున్న ఈ చిత్రం అంచనాల్ని అందుకుని బిజినెస్ కి తగ్గట్టే వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.