అక్కడ పెద్ద దెబ్బే పడనుందా

Update: 2018-01-11 09:44 GMT
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఊహించినట్టే మొదటి రోజు వసూళ్ళతో తన రేంజ్ ఋజువు చేసాడు. అసలు అగ్ని పరీక్ష ఇక ముందు ఉంది. టాక్ - రివ్యూస్ ఏ మాత్రం అనుకూలంగా రాకపోవడం ఒక దెబ్బ అయితే మౌత్ పబ్లిసిటీ కూడా అంతకంతా నెగటివ్ గా ఉండటం కూడా ప్రభావం చూపిస్తోంది. అతడు - ఖలేజా లాంటి సినిమాలకు కూడా మొదట ఇలాంటి టాక్ వచ్చి తర్వాత పర్వాలేదు అనిపించుకునే రేంజ్ కు వెళ్ళాయనే కామెంట్స్ ఫాన్స్ నుంచి వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అజ్ఞాతవాసికి చాలా పెద్ద రిస్క్ రిటర్న్స్ రూపంలో ఉంది. ముఖ్యంగా తెలంగాణాలో దీని మీద దాదాపు 29 కోట్ల పెట్టుబడి కేవలం ధియేట్రికల్ రైట్స్ కోసమే దిల్ రాజు పెట్టుబడిగా పెట్టాడు అనే వార్త గతంలోనే వచ్చింది. ఆ లెక్కన మొదటి రోజు వచ్చిన 5.5 కోట్ల షేర్ ని చూసుకుంటే ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది. కాని అది అంత ఈజీ అయితే కాదు.

బాహుబలి 2 ఫస్ట్ డే రికార్డుని నైజాంలో కనీసం టచ్ చేస్తుంది అనుకున్నారు కాని 9 కోట్ల మార్క్ ను రీచ్ కావడం కుదరలేదు. ఇక దిల్ రాజు పెట్టిన మొత్తం వెనక్కు రావాలంటే ఇప్పుడున్న స్పీడ్ కనీసం మరో పది రోజుల దాకా కొనసాగాలి. టాక్ ఇలాగే కొనసాగితే మాత్రం అది కష్టమే. నష్టాలు తప్పక పోవచ్చు. సీడెడ్ లో సైతం ఊహించని విధంగా కేవలం 3 కోట్ల 40 షేర్ మాత్రమే వచ్చిందని సమాచారం. గ్రాస్ 4.2 కోట్ల దాకా ఉంది. అక్కడ 16 కోట్లకు ఈ సినిమాను అమ్మినట్టు తెలిసింది. మరి మాస్ ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉండే సీడెడ్ లో ఈ ఫీట్ చేరుకోవడం గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడే దీని గురించి కంక్లూజన్ కు రాలేము కాని మరో ఐదు రోజులు ఆగాక పూర్తి క్లారిటీ వస్తుంది. సంక్రాంతికి షెడ్యూల్ చేసిన మిగిలిన మూడు సినిమాలు విడుదల అయ్యాక వాటి రిపోర్ట్స్ బట్టి ఫిగర్స్ లో మార్పులు జరగవచ్చు. అత్యధిక స్క్రీన్స్ లో విడుదల చేసినందుకే ఈ మాత్రం రికార్డు సాధ్యమైందని అంటున్న వారు లేకపోలేదు. తెలంగాణాలో అదనపు షోలు లేకపోవడం - టికెట్ రేట్లు సవరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం కూడా ప్రభావం చూపింది.
Tags:    

Similar News