అజ్ఞాతవాసి ట్రైలర్.. అబ్బే అప్పుడే కాదు

Update: 2017-12-25 11:19 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో రావడం అంతే కాకుండా పవన్ కళ్యాణ్ 25వ సినిమా కూడా ఇదే అవ్వడంతో అందరిలోను భారీ అంచనాలు అలుముకున్నాయి. ఏ మాత్రం తగ్గకుండా నిర్మాత సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇక సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా కూడా పవన్ ఫ్యాన్స్ చాలా దీర్ఘంగా చర్చించుకుంటున్నారు.

ఇకపోతే సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ఒక సునామీని సృష్టించింది. 24 గంటల్లోనే సౌత్ లో ఎక్కువ మంది చూసిన టీజర్ గా యూట్యూబ్ లో రికార్డ్ కొట్టేసింది. దీంతో ట్రైలర్ కూడా చాలా బావుంటుందని అందరు ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా కూడా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అని ఇతర మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే మొన్నటి వరకు ట్రైలర్ ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు.

కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం సినిమా ట్రైలర్ ను 2018 జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. సినిమా రిలీజ్ కు 10 రోజుల ముందు చేస్తేనే బెటర్ అని తప్పకుండా జనవరి ఒకటవ తేది నాలుగవ తేదీ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పవన్ అభిమానులు చాలా నిరాశ చెందారు. అయితే త్రివిక్రమ్ మాత్రం అభిమానులను నిరాశ చెందనివ్వకూడదు అని పవన్ పాడిన స్పెషల్ సాంగ్ ని కొంచెం తొందరగానే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు టాక్. మరి అభిమానులు ఎంతవరకు హ్యాపీగా ఫీల్ అవుతారో చూడాలి


Tags:    

Similar News