ఫోటో స్టోరి: నేచుర్ లో నేచుర‌ల్ బ్యూటీ

Update: 2022-06-22 03:30 GMT
నేచుర్ లో ఎంతో నేచుర‌ల్ గా క‌నిపిస్తున్న ఈ అందాల ఆడ‌బొమ్మ ఎవ‌రో ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. శ‌ర్మా గాళ్స్ లో ఒక అంద‌మైన గాళ్. పేరు ఐషా శ‌ర్మ‌. ఇటీవ‌ల హ‌ద్దులు చెరిపేసే గ్లామ‌ర్ షోతో సోష‌ల్ మీడియాని హీటెక్కిస్తోంది. తాజాగా ఈ సిరీస్ నుంచి శ‌ర్మాగాళ్ కొత్త లుక్ విడుద‌ల కాగా వైర‌ల్ గా మారింది. నేచుర్ లో ఎంతో నేచుర‌ల్ గా అందాల‌ను ఆర‌బోసింది ఈ బ్యూటీ. దీనిపై అభిమానుల నుంచి ర‌క‌ర‌కాల కామెంట్లు వేడెక్కిస్తున్నాయి.

ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. శ‌ర్మ సిస్ట‌ర్స్ ని విడిగా చూడ‌డం చాలా అరుదు. జిమ్ కి వెళ్లినా .. ప‌బ్ కి వెళ్లినా .. మార్కెట్ కి వెళ్లినా లేదా ఇంట్లో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డిపినా.. ఒక‌రితో ఒక‌రు క‌లిసి ఎంతో ఫ‌న్ ని క్రియేట్ చేస్తుంటారు. ఐషా శ‌ర్మ సోలోగా క‌నిపించేది చాలా త‌క్కువ‌. త‌న సోద‌రి నేహాశ‌ర్మ‌తో క‌లిసి ఐషా శ‌ర్మ నిరంత‌ర ఫోటోషూట్ల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు.

ఓవైపు సినిమాల్లో వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూనే సిస్ట‌ర్స్ ఓటీటీలోనూ ప్ర‌యోగాలు చేస్తున్నారు. నేహా శర్మ - ఐషా శర్మ సిస్ట‌ర్స్ ఇటీవ‌ల త‌మ వ్యక్తిగత జీవితం ఆధారంగా కొత్త రియాలిటీ సిరీస్ ను తెర‌పైకి తీసుకురావ‌డం తెలిసిందే. ఈ కార్యక్రమం అమెరికన్ షో `కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్` మాదిరిగానే ఉంటుంది.

శర్మ సిస్ట‌ర్స్ ఈ షోతో ఇటీవ‌ల మెరుపులు మెరిపిస్తున్నారు. నేహా శర్మ స్వ‌యంగా త‌న‌ కొత్త OTT షో `షైనింగ్ విత్ శర్మస్` టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ షో స్క్రిప్ట్ లేకుండా పచ్చిగా నిజ‌జీవితంలానే ఉంటుందని సిస్ట‌ర్స్ ఇంత‌కుముందే చెప్పారు. అభిమానుల‌కు ఇక్క‌డ అంతు లేని వినోదం ద‌క్కుతుంది. గ్లామ‌ర్ విందుకు అయితే కొద‌వేమీ లేద‌ని ఆ చిన్న వీడియో వెల్ల‌డించింది.

సిస్ట‌ర్స్ ఇద్దరూ తమ వ్య‌క్తిగ‌త జీవితానికి మ‌సాలా అంశాల‌కు సంబంధించిన విశేషాల‌ను ఈ షోలో వారి అభిమానులతో పంచుకుంటారు. జూన్ నుంచి సోషల్ స్వాగ్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షో అందుబాటులోకి వ‌చ్చింది. ఐషా నేను ఎప్పుడూ అనుకున్న‌ది చేసేందుకు వెన‌కాడ‌మ‌ని నేహా శ‌ర్మ తాజా చాటింగులో వెల్ల‌డించారు.

కొత్త‌ద‌నం కోసం ప‌ని చేస్తామ‌ని నేహా తెలిపారు. షైనింగ్ విత్ శర్మాస్ ఆ దిశగా మరో మెట్టు. ఇది మనందరికి సంబంధించిన ప్రదర్శన.. సరదాగా.. నిజాయితీగా.. పచ్చిగా  ఫిల్టర్ లేనిదిగా అల‌రిస్తుంద‌ని తెలిపారు. నేహా శ‌ర్మ ప్ర‌స్తుతం న‌వాజుద్దీన్ తో ఓ సినిమా చేస్తుండ‌గా.. ఐషా శ‌ర్మ ప‌లు చిత్రాల‌కు క‌మిటైంది.
Tags:    

Similar News