దుబాయ్ ఎక్స్ పోలో ఐశ్వ‌ర్యారాయ్ మెరుపులు

Update: 2021-10-07 00:30 GMT
మాజీ విశ్వ‌సుందరి ఐశ్వ‌ర్యారాయ్ గ‌త కొంత‌కాలంగా మీడియా గ్లేర్ కి దూరంగా స్థ‌బ్ధుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై నిరంత‌రం సంద‌డి చేస్తూ క‌నిపించే ఐసూ ఏంటిలా మూగ‌వోయింది? అంటూ అభిమానులు క‌ల‌త‌కు గుర‌య్యారు.

కానీ ఆ క‌ల‌త‌ను బెంగ‌ను తీర్చేందుకు ఇప్పుడు పారిస్ ఫ్యాష‌న్ వీక్ 2021 స‌హ‌క‌రిస్తోంది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ గత రెండు రోజులుగా అభిషేక్ .. ఆరాధ్యతో కలిసి పారిస్ కు వెళ్లి పారిస్ ఫ్యాషన్ వీక్ 2021 లో ర్యాంప్ వాక్ చేసారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తన మొదటి అంతర్జాతీయ యాత్ర ఇద‌ని త‌లిసింది. ప్ర‌స్తుతం దుబాయ్ లో ఉన్న‌ ఐష్ మంగళవారం ఓ ప్రొఫెషనల్ ఈవెంట్ లో బిజీగా ఉన్నారు. ఈవెంట్ నుండి ఐశ్వర్య రాయ్ ఫోటోలను ఆమె మేకప్ ఆర్టిస్ట్ ఆదిత్య శర్మ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఖరీదైన నల్లటి ఇండో-వెస్ట్రన్ వస్త్రధారణతో ఐష్ ఎంతో అందంగా క‌నిపించారు. ``మర్చిపోవద్దు`` అంటూ సింపుల్ గామె స్టేట్ మెంట్ ఇవ్వ‌గా.. త‌న చేతికి ఉన్న‌ పొట్లి బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఉంగరాల జుట్టు తో ఐసూ లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. ఎక్స్ పో 2020 దుబాయ్ లో జరుగుతున్న ప్యానెల్ డిస్కషన్ కు హాజరయ్యే ఉన్నత స్థాయి తారల జాబితాలో ఐశ్వర్య అమెరికన్ నటి అజా నయోమి కింగ్ ఉన్నారు.

ప్ర‌ఖ్యాత లోరియ‌ల్ సంస్థ‌.. ఈ ఈవెంట్ ని నిర్వ‌హిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా మహిళలు .. అట్టడుగున ఉన్న వ్యక్తులు ఎదుర్కొంటున్న  చాలా రకాల వేధింపులకు వ్యతిరేకంగా ఈవెంట్ ఇది. ఎక్స్ పో 2020 దుబాయ్ మిలీనియం యాంఫిథియేటర్ లో ఈ వేడుక జరుగుతోంది.
Tags:    

Similar News