తెలుగు మూలాలున్న అమ్మాయి ఐశ్వర్య రాజేష్. తమిళనాట ప్రస్తుతం ఈ అమ్మడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను సినిమాలకు పైగా చేస్తోంది. ఒక కొత్త హీరోయిన్ ఒకేసారి ఈ స్థాయిలో సినిమాలు చేయడం రికార్డ్ అని చెప్పాలి. తమిళనాట భారీ ఎత్తున సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈమెను విజయ్ దేవరకొండ.. క్రాంతి మాధవ్ ల మూవీ కోసం ఎంపిక చేయడం జరిగింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తమిళంలో 'కణ' చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. దాంతో వెంటనే ఆ సినిమా రీమేక్ చేసి విజయ్ దేవరకొండ మూవీ కంటే ముందే విడుదల చేశారు.
'కణ' చిత్రంకు రీమేక్ గా తెలుగులో 'కౌసల్య కృష్ణమూర్తి' అంటూ మూవీ వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలైతే వచ్చాయి కాని కలెక్షన్స్ మాత్రం చాలా నిరుత్సాహంగా ఉన్నాయి. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య రాజేష్ ఒప్పుకుంది. సినిమా సక్సెస్ మీట్ లో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ సినిమా ఆడుతున్న థియేటర్ కు వెళ్లాం. అక్కడ చాలా వరకు సీట్లు ఖాళీగా కనిపించాయి. కొత్త అమ్మాయినవ్వడం వల్ల ప్రేక్షకులు సినిమాను ఆధరించడం లేదనిపిస్తుంది. కాని సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం ఆనందంగా ఉంది.
ఈ సినిమాను విజయ్ దేవరకొండతో నేను నటిస్తున్న సినిమా విడుదలైన తర్వాత విడుదల చేస్తే బాగుండేదని అంతా అంటున్నారు. కాని మంచి కంటెంట్ వల్ల సినిమా ఆడుతుందని మేము అనుకున్నామని ఇండైరెక్ట్ గా విజయ్ దేవరకొండతో చేస్తున్న మూవీ తర్వాత ఈ చిత్రం విడుదల చేస్తే బాగుండేది అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇప్పుడనుకుని ఏం లాభం. సినిమా కాస్త ఆలస్యంగా విజయ్ దేవరకొండ.. క్రాంతి మాధవ్ ల మూవీ తర్వాత వచ్చి ఉంటే టాలీవుడ్ లో ఆ సమయంకు ఐశ్వర్య రాజేష్ కు మంచి గుర్తింపు వచ్చి ఉండేది.. కౌసల్య కృష్ణ మూర్తి సినిమాకు ఓపెనింగ్స్ అయినా బాగుండేవి.