న‌టి లైఫ్ లో ఊహించ‌నంత విషాదం షాకిస్తోందే

Update: 2020-05-28 05:00 GMT
ఆమె ఓ ప్ర‌ముఖ న‌టుడి కుమార్తె. న‌ట వృత్తిలో ఉన్న కుటుంబ‌మే. అయినా కానీ సిల్వ‌ర్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్ట‌లేదు. త‌న చిన్న వ‌య‌సులోనే నాన్న చ‌నిపోయారు. అటుపై అమ్మ త‌మ‌కు అన్నీ అయ్యింది. త‌న‌ను.. త‌న ఇద్ద‌రు సోద‌రుల‌ను పెంచి పోషించింది. అందుకోసం తాను చేయ‌ని ఉద్యోగం లేదు. కొన్నాళ్లు చీర‌లు అమ్మింది. మ‌రికొన్నిరోజులు ఎల్.ఐ.సీ ఏజెంట్ గా ప‌ని చేసింది. రియాల్టీ కంపెనీల‌తో ప‌ని చేసింది. ఇంకా పొట్ట గ‌డ‌వ‌డానికి త‌న పిల్ల‌ల్ని పెంచి పెద్ద‌వారిని చేయ‌డానికి నానా పాట్లు ప‌డింది. ఇప్ప‌టికీ ఎల్.ఐ.సీ పాల‌సీలు చేర్పిస్తుంటుంది.

అయితే విధి వైచిత్రి అక్క‌డితో విడిచిపెట్ట‌లేదు. త‌న సోద‌రుల్లో ఒక‌రు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.. అది హ‌త్య అని ప్ర‌చార‌మైంది. ఇక వేరొక సోద‌రుడు ఒక యాక్సిడెంట్ లో దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. దాంతో అమ్మ కుంగిపోయింది. త‌న‌కు తాను మాత్ర‌మే మిగిలింది. చివ‌రికి అమ్మ‌కు సాయం చేయ‌డం కోసం తాను చిరుద్యోగాలు చేసింది. పెద్ద స్టార్ గా ఎద‌గాల‌ని క‌ల‌లు గ‌ని చివ‌రికి ఏదోలా క‌థానాయిక అయ్యింది. అయితే అక్క‌డా ఎన్నో అవ‌మానాలు. త‌న రంగు గురించి విమ‌ర్శించిన వాళ్లు ఉన్నారు. అయితే వీట‌న్నిటినీ ఓ వేదిక‌పై ఆమె వెల్ల‌డించిన తీరు కంట త‌డి పెట్టించింది. తిరుచ్చీ ఐఐటీలో జరిగిన టెడ్-‌ఎక్స్ చర్చలో స‌ద‌రు క‌థానాయిక త‌న జీవిత పోరాటం గురించి స‌వాళ్ల గురించి వెల్ల‌డించింది. ఇంత‌కీ ఎవ‌రీ న‌టి? అంటే కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి ఫేం ఐశ్వ‌ర్యా రాజేష్‌. 30 ఏళ్ల ఐశ్వర్య రాజేష్ ఇటీవ‌లే వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. తమిళం- తెలుగు- కన్నడ- మలయాళం- హిందీ భాష‌ల్లో న‌టిగా కొన‌సాగుతోంది.

కుటుంబంలో ఐశ్వ‌ర్య తండ్రి.. తాత న‌టులే. త‌న‌ అత్త హాస్యనటి శ్రీలక్ష్మి. అయితే ఇంత‌ మంది ఉన్నా కానీ త‌న‌కు ఎలాంటి రిక‌మండేష‌న్లు లేవు. స్వ‌యంకృషితో కష్టపడి పనిచేసింది. ఒకానొక ద‌శ‌లో యాంక‌ర్ గా ప‌ని చేసింది. న‌టి అయ్యాక కూడా తిరిగి 2009 లో యాంకర్ ‌గా తన వృత్తిని ప్రారంభించింది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. తన చిన్ననాటి రోజులతో చెన్నైలోని హౌసింగ్ బోర్డులో పెరిగింద‌ట‌. ఐశ్వర్య తన 8 వ ఏట తన తండ్రి అయిన‌ నటుడు రాజేష్ ను కోల్పోయింది. త‌న త‌ల్లిగారు నలుగురు పిల్లలను పెంచేందుకు చాలా ఇబ్బంది ప‌డ్డారు. అప్ప‌టికి తాను చాలా చిన్న‌పిల్ల‌. అమ్మ చ‌దువుకోలేదు. దాంతో ముంబై నుంచి చీరలు సేకరించి చెన్నైలో అమ్మేవారు. అలాగే ఎల్ఐసి ఏజెంట్ గానూ ప‌ని చేస్తూ... రియల్ ఎస్టేట్లో కూడా అడపాదడపా పని చేసింది. ఇప్ప‌టికీ తాను నా సహనటులకు ఎల్‌.ఐ.సి పాలసీని అమ్మడానికి ప్రయత్నిస్తుంది`` అని ఐశ్వర్య తెలిపారు. త‌న‌ పెద్ద సోదరుడు తన 12 ఏళ్ళ వయసులో మరణించాడని .. అతడు ఓ రిలేష‌న్ షిప్ లో ఉండ‌గా.. ఆత్మహత్య చేసుకున్నాడ‌ని.. హత్య జ‌రిగింద‌ని ప్ర‌చార‌మైంది. దానిపై ఇప్ప‌టికీ త‌మ కుటుంబం గందరగోళంలోనే ఉంద‌ని వెల్ల‌డించింది.

తన రెండవ సోదరుడు కూడా కొన్ని నెలల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడని ఐశ్వ‌ర్య తెలిపింది.  ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఐశ్వర్య తల్లి వినాశనానికి గురైంది. ఆ క్ర‌మంలోనే 16 సంవత్సరాల వయస్సులో ఐశ్వర్య ఒక సూపర్ మార్కెట్ వెలుపల చాక్లెట్ బ్రాండ్ కు ప్ర‌మోష‌న్ చేస్తూ తొలి జీతం అందుకుంది. మొదటి ఉద్యోగంలో ఆమెకు రూ .225 చెల్లించారట‌. తాను పెద్ద పెద్ద క‌ల‌లు క‌నేది. రియాలిటీ షో వ్యాఖ్యాత‌గా ప‌ని చేసింది. ఓ డ్యాన్స్ షోలో పాల్గొని టైటిల్ గెలుచుకుంది. ఆర్థికంగా ఎదిగేందుకు న‌టి అయినా అక్క‌డ లైంగిక వేధింపులు.. ట్రోల్స్ ఎదుర‌య్యాయి. అవర్గలమ్ ఇవర్గలమ్ చిత్రంతో న‌టి అయినా అదేమీ పెద్ద‌గా ఆడ‌లేదు. పా.రంజిత్ `అట్టా‌క‌తి` చిత్రం తో విజ‌యం వ‌రించింది. ప్ర‌స్తుతం క‌థానాయిక‌గా సౌత్ లో వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్నారు ఐశ్వ‌ర్యా రాజేష్‌.
Tags:    

Similar News