బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నాన్నగారు వీరు దేవగణ్ ఈరోజు ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం అయనకు ఊపిరి సరిగా అందకపోవడంతో శాంతాక్రజ్ ఏరియాలోని సూర్య హాస్పిటలో చేర్పించారట. అక్కడి వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కొద్దిగంటల తర్వాత గుండెపోటుతో మరణించారు. ఆయనకు గత పదిహేను రోజులుగా ఆరోగ్యం సరిగా లేదట.. దీంతో అజయ్ దేవగణ్ తన కొత్త సినిమా 'దే దే ప్యార్ దే' ప్రమోషనల్ ఇంటర్వ్యూలను క్యాన్సిల్ చేసుకున్నారట.
వీరు దేవగణ్ బాలీవుడ్ లో ఒక ప్రముఖ స్టంట్ మాస్టర్. ఆయన దాదాపుగా 80 కి పైగా హిందీ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయన పని చేసిన సినిమాల్లో 'హిమ్మత్ వాలా'(1983).. 'షెహెన్ షా'(1988).. 'దిల్వాలే'(1994) లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. వీరు దేవగణ్ 'హిందుస్తాన్ కీ కసమ్'(1999) అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన నిర్మాతగా 'సింగాసన్'(1986).. 'హిందుస్తాన్ కీ కసమ్'(1999).. 'దిల్ క్యా కరే'(1999).. మూడు చిత్రాలను నిర్మించారు.
వీరు దేవగణ్ మృతి విషయం తెలిసిన బాలీవుడ్ సెలబ్రిటీలు అజయ్ దేవగణ్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలుపుతూ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతాయని వెల్లడించారు.