నేను సింగిల్ గా మిగలడంకు ఆ హీరోనే కారణం

Update: 2021-11-06 02:30 GMT
హైదరాబాద్‌ కు చెందిన ముద్దుగుమ్మ టబు బాలీవుడ్ లో ఒకానొక సమయంలో టాప్ స్టార్‌ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా మూడు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా సినిమాల్లో కొనసాగుతూనే కీలక పాత్రల్లో నటిస్తోంది. తనకు వచ్చిన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే పాత్రలు ఎంపిక చేసుకుంటూ ఉండే టబు ఇటీవలే అయిదు పదుల వయసును క్రాస్‌ చేసింది. పెద్ద ఎత్తున టబు గురించి మీడియాలో పుకార్లు ఉన్నాయి. ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనేది చాలా పెద్ద ప్రశ్న. ఇక టబు భర్త అంటూ గూగుల్‌ లో కొడితే రకరకాలుగా ఫలితాలు వస్తాయి. కొందరు టబుకు పెళ్లి అయ్యిందని అనుకుంటే మరి కొందరు మాత్రం ఆమెకు పెళ్లి కాలేదు అంటూ ఉంటారు. అసలు విషయం ఏంటీ అంటే టబు పెళ్లి చేసుకోలేదు. అయిదు పదుల వయసు దాటినా కూడా ఇంకా ఆమె సింగిల్ గానే ఉంది. ఇక ముందు కూడా ఆమె సింగిల్ గానే ఉంటుందని అంటారు.

టబు ఈ ఇంటర్వ్యూలో అయినా.. ఏ టాక్ షో లో అయినా కూడా తన పెళ్లి గురించి మాట్లాడేందుకు ఇబ్బంది పడదు. పెళ్లి ప్రస్థావన వచ్చిన ప్రతి సారి కూడా టబు తాను సింగిల్ గా ఉండటంకు కారణం అజయ్ దేవగన్ అంటూ పలు సందర్బాల్లో చెబుతూనే ఉంటుంది. తాజాగా ఆమె మరోసారి తాను సింగిల్ గా మిగలడానికి కారణం అజయ్‌ దేవగన్ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. టబు కు అజయ్ దేవగన్‌ కు ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు నుండి పరిచయం ఉంది. టబు బ్రదర్‌ కు అజయ్ ఫ్రెండ్‌. ఇద్దరు చిన్నప్పటి నుండి జుహులో కలిసి పెరిగారు. టబుకు 14 ఏళ్లు ఉన్న సమయంలో ఆమె వెంట ఎవరైనా అబ్బాయి పడ్డట్లుగా అజయ్ కి తెలిస్తే ఊరుకునేవాడు కాదట. వెంటనే అతడికి వార్నింగ్‌ ఇవ్వడం లేదంటే కొట్టడం చేసేవాడట.

నేను ఎక్కడకు వెళ్లినా కూడా నాతో పాటు అజయ్ కూడా వచ్చేవాడు. అలా నన్ను ఎవరు ప్రేమించకుండా అతడు చేశాడు. కాని అతడు మాత్రం తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేస్తుంది. పదే పదే అజయ్‌ దేవగన్‌ వల్లే తాను సింగిల్ గా మిగిలి పోయాను అంటూ ఫన్నీగా చెబుతుంది తప్ప అసలు విషయం ఏంటీ.. పెళ్లి చేసుకోక పోవడంకు కారణం ఏంటీ అనేది మాత్రం సీరియస్ గా చెప్పడం లేదు. అప్పట్లో ఒక హీరోతో ప్రేమాయణం వల్లే ఈమె పెళ్లి చేసుకోకుండా  మిగిలి పోయింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. కాని ఆ విషయానికి మాత్రం ఆమె సమ్మతించదు. తాను సింగిల్ గా ఉండటంకు టబు ముందు ముందు అయినా సీరియస్ గా కారణం చెప్తుందేమో చూడాలి.
Tags:    

Similar News