ఎన్నేళ్లని అలా ముప్పై యేళ్ల వాడిగా కనిపించేది… ఇక చాలు, వయసుకు తగ్గ పాత్రలు దొరికితే సంతోషం అంటున్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. ఇటీవలే అజయ్ వయసు యాభై దాటేసింది. ఇలాంటి నేపథ్యంలో ఈ హీరో ఒక సినిమాలో తన వయసుకు తగ్గ పాత్ర చేస్తున్నాడు.
ఆ సినిమానే 'దే దే ప్యార్ దే' ఇందులో అజయ్ యాభై యేళ్ల వయసున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతడి భార్య పాత్రలో టబు నటిస్తోంది. అలా పెళ్లి అయ్యాకా ఒక యువతి ప్రేమలో పడే వ్యక్తిగా అజయ్ దేవగణ్ నటిస్తూ ఉన్నాడు ఆ సినిమాలో. ఆ యువతి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ చేసింది.
ఈ సినిమాలో తన వయసుకు తగ్గ పాత్రను చేస్తున్న అజయ్ దేవగణ్ ఇక ఇలాంటి పాత్రలు కావాలని అంటున్నాడు. వన నిజ వయసు యాభై దాటినా ఇంకా తెరపై ముప్పై యేళ్ల యువకుడిగానే కనిపించడానికి పెద్ద ఆసక్తి కూడా లేదని ఈ హీరో అంటున్నాడు. అలా కనిపించడం శ్రమతో కూడిన విషయం అని చెబుతున్నాడు.
బాలీవుడ్ తమ లాంటి వారి విన్నపాన్ని పట్టించుకుని.. తనకు వయసు తగ్గ పాత్రలు ఇస్తే బావుంటుందని అజయ్ దేవగణ్ వ్యాఖ్యానించాడు. మరి చాలా మంది హీరోలు తమ వయసుతో సంబంధం లేకుండా తెరపై ఇంకా కుర్రాడిగానే కనిపించాలని తాపత్రయ పడుతూ ఉంటారు. అజయ్ మాత్రం వయసుకు తగ్గ పాత్రలు కావాలని అంటున్నాడు!