బాలీవుడ్ ఖైదీ ఈయ‌నేనంటూ!

Update: 2020-02-25 07:15 GMT
ఇటీవ‌ల కాలంలో ద‌క్షిణాది సినిమాల‌ రీమేక్ ల‌పై బాలీవుడ్ ఆస‌క్తి అంత‌కంత‌కు పెరుగుతోంది. వీటితోనే బాలీవుడ్ హీరోలు బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టేస్తున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద సునాయాసంగా వంద‌ల కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొడుతున్నారు. మ‌న‌వైన క‌థ‌ల్ని తెలివిగా హిందీలోకి డ్రాగ్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టేస్తున్నారు. బాలీవుడ్ స్టార్లంతా సౌత్ పై ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా తెలుగు క‌థ‌ల‌పై ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల కార్తీ న‌టించిన ఖైదీ త‌మిళ్ స‌హా తెలుగులో ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రాన్ని హిందీలో రియ‌ల‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ రీమేక్ చేయ‌నుంది. డ్రీమ్ వారియ‌ర్స్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే నిర్మాణ సంస్థ హీరో అన్వేష‌ణ‌లో ప‌డింది.

ఈ రీమేక్ లో స‌ల్మాన్ ఖాన్... హృతిక్ రోష‌న్ ల‌లో ఎవ‌రో ఒక‌రు న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల‌ ప్ర‌చారం సాగింది. తాజాగా ఈ వ‌రుస‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ పేరు చేరింది. ఆయ‌న‌ను సంప్ర‌దించ‌గా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని బాలీవుడ్ మీడియా ప్ర‌చారం హోరెత్తిస్తోంది. స్క్రిప్ట్ విన్న త‌ర్వాత మాతృక వెర్ష‌న్ ఖైదీ చూసి ఓకే చేసారుట‌. ఆ సినిమాలో కార్తీ పాత్ర‌...స్టోరీ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌ని చిత్ర యూనిట్ తో అన్నారుట‌. దీన్ని బ‌ట్టి హీరోగా దాదాపు అజ‌య్ ఖాయ‌మైన‌ట్లేన‌ని భావిస్తున్నారు.

బాలీవుడ్ లో ఈ ప్రాజెక్ట్ ను ఏ ద‌ర్శ‌కుడు హ్యాండిల్ చేస్తాడు? అన్న వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌స్తుతం అజ‌య్ దేవ‌గ‌ణ్ టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ లో న‌టిస్తున్నారు. హిందీలో మైదాన్ అనే చిత్రంలోనూ న‌టిస్తున్నారు.
Tags:    

Similar News