బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరియు ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మద్య గత కొంత కాలంగా ఉన్న వివాదం తాజాగా సమసి పోయింది. అజయ్ దేవగన్ తన భార్య కాజోల్ తో కలిసి కరణ్ షో కు హాజరు అవ్వడంతో ఇద్దరి మద్య వివాదం, విభేదాలు పూర్తి గా సమసి పోయినట్లే అని క్లారిటీ వచ్చింది. అయితే వివాదం సమయంలో తాను అనుభవించిన కొన్ని ఫీలింగ్స్ ను కరణ్ జోహార్ తన ఆత్మకథ అయిన అన్ సూటబుల్ బాయ్ లో పేర్కొన్నాయి.
ఆ సమయంలో కాజల్ తన పై చేసిన కామెంట్స్ తీవ్రంగా కలచి వేశాయని, ఆమెతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. అన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న ఆమె నన్ను అర్థం చేసుకోకుండా నాపై ఆ కామెంట్స్ చేసిన సమయంలో ఆమెను మళ్లీ జీవితంలో కలుసుకోవద్దనుకున్నా, కనీసం ఆమె మొహం కూడా చూడొద్దని నిర్ణయించుకున్నా. ఏదైనా కార్యక్రమంలో ఆమె కనిపించినా కూడా మొహం చూడకుండా ఉండేవాడిని. ఒక షోలో ఆమెతో కలిసి పాల్గొనాల్సి వచ్చిన సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. అయితే ఆమెతో ఎక్కువ రోజులు మాట్లాడకుండా ఉండలేక పోయాను, అందుకే క్షమాపణలు చెప్పానని కరణ్ అన్ సూటబుల్ బాయ్ లో చెప్పుకొచ్చాడు.
అప్పట్లో అజయ్ దేవగన్ శివాయ్ చిత్రంపై బ్యాడ్ కామెంట్స్ చేయమంటూ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ కు కరణ్ జోహార్ డబ్బులు ఇచ్చాడట. ఆ వీడియో బయటకు రావడంతో తన భర్త సినిమాకు బ్యాడ్ పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నించిన కరణ్ ను మిత్రుడు అని కూడా చూడకుండా కాజోల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సినిమా కోసం కరణ్ మరో సినిమాకు బ్యాడ్ పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అప్పట్లో ఆయన పై బాలీవుడ్ వర్గాల వారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.