`దూకుడు` విలన్ అజాజ్ ఖాన్ అరెస్ట్ కలకలం రేపుతోంది. ముంబై సైబర్ క్రైమ్ పోలీస్ అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి ఉక్కిరి బిక్కిరి చేశారు. అతడి అరెస్ట్ ముంబై సెలబ్రిటీల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అతడు అంత పెద్ద నేరం ఏం చేశాడు? అంటే.. డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే.
సామాజిక మాధ్యమాల వెల్లువలో టిక్ టాక్ వీడియోల ట్రెండ్ గురించి తెలిసిందే. అత్యంత ప్రభావవంతమైన ఈ మాధ్యమంలో ఏ తప్పు చేసిన సైబర్ క్రైమ్ అధికారులు వేటాడేస్తున్నారు. ఈ వేటలో భాగంగానే విలన్ అజాన్ ఖాన్ అడ్డంగా బుక్కయిపోయాడు. ఒక కులాన్ని ఒక జాతిని వర్గాన్ని దూషిస్తూ అతడు పోస్ట్ చేసిన ఓ టిక్ టాక్ వీడియో క్షణాలు నిమిషాల్లో వైరల్ గా మారింది. అతడి దూషణల ఫర్వంపైనా అభ్యంతరకర వ్యాఖ్యలపైనా హెడ్ లైన్స్ లో వార్తలొచ్చాయి. దీంతో వ్యతిరేక వర్గం మండి పడడడమే గాకుండా అతడిపై ఆన్ లైన్ లోనే ఫిర్యాదులు చేశారు. దానికి స్పందించిన ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.
అజాజ్ ఖాన్ `బిగ్ బాస్-హిందీ` సెలబ్రిటీగా ప్రపంచానికి సుపరిచితం. విలన్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసినవాడు. దూకుడు-నాయక్-టెంపర్- రోగ్ వంటి చిత్రాల్లో అతడు విలన్ గా నటించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అజాజ్ జోరుమీదున్నాడు. రకరకాల అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడిస్తూ వివాదాల్లోకి ఎక్కుతున్నాడు. ఒకే ఒక్క వివాదాస్పద టిక్ టాక్ వీడియో అతడిని కటకటాల పాల్జేయడం చర్చకొచ్చింది. ఐపీసీ సెక్షన్ 153ఏ-34-67 ఐటీ యాక్ట్ కింద అతడిని పోలీసులు అరెస్టు చేసి లోన వేశారు. అయినా విలన్ వేషాలు సోషల్ మీడియాలో వేస్తానంటే కుదురుతుందా?