''మన ఆసియా ఖండంలో ఎవరైనా హీరో ఫ్లయిట్ నడపాలంటే.. ఖచ్చితంగా అజిత్ అయ్యుండాలి.. ఎందుకంటే అతడికి మాత్రం కమర్షియల్ పైలట్ లైసన్స్ ఉంది'' అంటూ ఇప్పుడు తమిళ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే అజిత్ ను లేకపోతే విజయ్ ను పొగడటమే పనిగా పెట్టుకుని ఈ వెర్రి అభిమానులు.. ఇప్పుడు పరాకాష్టకు చేరిపోయి.. ఏకంగా ఇటువంటి పబ్లిసిటీతో విరగబడుతున్నారు. మళ్ళీ మళ్ళీ కుళ్ళు పంచ్ లు వేసేస్తున్నారు.
అయితే ఇదంతా చూస్తున్న ఇతర బాషల వారు.. అలాగే ఇతర సినిమా అభిమానులు మాత్రం ఇదేం పిచ్చి బాబోయ్ అంటూ నవ్వేసుకుంటున్నారు. ఇప్పుడు.. అజిత్ ఎప్పుడో ఈ పైలెట్ ట్రైనింగ్ లో శిక్షణ పొంది ఉంటాడు సరే. అందుకుని చెప్పి ఇప్పుడు వెంటనే ఒక పెద్ద బోయింగ్ విమానం నడిపేస్తాను అంటే పిలిచి కాక్ పిట్ లో ఉన్న ఆపరేటింగ్ గేర్ చేతిలో పెట్టేయడానికి అదేమన్నా ఎక్స్ బాక్స్ లో ఉండే జాయిస్టిక్ ఏంటండీ. మినిమం ఫ్లయింగ్ అవర్స్ అనేవి లేకపోతే కాక్ పిట్ కాదు కదా.. కాక్ పిట్ డోర్ దగ్గర కూడా నిలబడటం కష్టం.
ఇకపోతే ఇలా ఏదన్నా నేర్చుకుంటేనో లేకపోతే ఏదన్నా బిజినెస్ పెట్టుకుంటేనో.. అది వారొక్కరికే సొంతం అనుకోవడం చాలా ఆశ్చర్యకరం. హీరోలను సినిమాల పరంగా ఎలా పొగుడుకున్నా ఓకె కాని.. మరీ పర్సనల్ లైఫ్ వరకు వెళ్ళిపోయి ఇలాంటి కుళ్లు జోకులు వేసుకుంటే నవ్వు రాదేంటండీ. పాపం ఆ ఫ్యాన్స్ కు ఇవన్నీ అర్ధమవుతున్నాయో లేదో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/