అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఈ రోజు జరుగుతోంది. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. తమిళనాడు.. పశ్చిమబెంగాల్ ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. బెంగాల్ లో రికార్డుస్థాయి దశల్లో పోలింగ్ జరుగుతుండగా.. తమిళనాడులో మాత్రం ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.
ఓట్లు వేసేందుకు తమిళ నటీనటులు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్ కు వస్తున్నారు. తన భార్య షాలినీతో కలిసి హీర్ అజిత్ తిరువాన్మయూర్ లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అతడి రాక సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తు.. అతని చుట్టూ చేరే ప్రయత్నం చేశారు. ఓటు వేసి వచ్చిన ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయనపై ఎగబడ్డారు.
దీంతో.. అజిత్ తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పని ఆయన..తాజాగా మాత్రంఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫోన్లతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతున్న అభిమానుల్లో ఒకరి ఫోన్ ను తీసుకొని జేబులో పెట్టేసుకొని అజిత్ వెళ్లిపోయారు. తనకు దూరంగా వెళ్లాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన అజిత్.. ముఖానికి మాస్కుతో పాటు.. రెండు చేతులకు గ్లౌజ్ వేసుకున్నారు. అయితే.. ఆయన సతీమణి షాలినీ మాత్రం ఒక చేతికి మాత్రమే గ్లౌజ్ వేసుకోవటం గమనార్హం.
Full View