సంక్రాంతి రేసులో ఉన్న బాలయ్య సినిమా డిక్టేటర్ ను తమిళ - మలయాళ భాషల్లోనూ అనువదించి రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడేమో తమిళ రీమేక్ తెరమీదికి వచ్చింది. ఈ చిత్రాన్ని తమిళ - హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సన్నాహాలు చేస్తోందట. బాలీవుడ్ కు ఇప్పటికే హీరో ఫిక్సయిపోగా.. కోలీవుడ్ కోసం ఓ బడా స్టార్ తో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిసింది.
హిందీలో అజయ్ దేవగన్ హీరోగా డిక్టేటర్ ను పునర్నిర్మించాలన్నది ఈరోస్ వాళ్ల ప్లాన్. తెలుగు వెర్షన్ తీసిన శ్రీవాసే హిందీలోనూ దర్శకత్వం వహిస్తాడట. ఇక తమిళ వెర్షన్ కు హీరోగా అజిత్ ను అనుకుంటున్నట్లు సమాచారం. తమిళంలో బాలయ్య తరహా మాస్ మసాలా సినిమాలు అజితే చేస్తుంటాడు. గత దీపావళి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన వేదాలం కూడా పక్కా మాస్ మసాలా సినిమానే.
డిక్టేటర్ కథ గురించి చెప్పగా అజిత్ పాజిటివ్ గానే రెస్పాండయినట్లు తెలిసింది. ఐతే డిక్టేటర్ రిజల్ట్ చూశాక తుది నిర్ణయం చెబుతానని అన్నాడట అజిత్. సినిమాకు హిట్ టాక్ వస్తే.. ఇంతకుముందు అజిత్ తో వీరం - వేదాలం సినిమాలు తీసిన శివ దర్శకత్వంలో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. రీమేక్ సంగతే నిజమైతే డిక్టేటర్ తమిళ డబ్బింగ్ పనులు ఆపేస్తున్నట్లే అన్నమాట.