డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో హీరోలుగా పరిచయం అయిన వారు ఎంతో మంది స్టార్స్ గా దూసుకు పోతున్నారు. పూరి సినిమాల్లో నటించిన తర్వాత స్టార్స్ అయిన హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన తనయుడు ఆకాష్ పూరి హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన సమయంలో కూడా ఖచ్చితంగా పూరి తన కొడుకును స్టార్ గా నిలపడం ఖాయం అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేశారు. హీరోగా మెహబూబా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాష్ పూరి ఆ సినిమా తో నిరాశ పర్చాడు. పూరి స్వయంగా తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
పూరి తన కొడుకు రెండవ సినిమాను శిష్యుడి చేతిలో పెట్టాడు. రొమాంటిక్ అంటూ రెండేళ్ల క్రితం మొదలు పెట్టాడు. కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన ఆ సినిమా షూటింగ్ ఏదోలా పూర్తి చేశారు. కాని విడుదలకు మాత్రం సిద్దం చేయడం లేదు. పూరి స్వయంగా నిర్మించిన ఈ సినిమా విడుదల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అనే విషయమై క్లారిటీ లేదు. చిత్రంను ఆమద్య ఓటీటీ లో విడుదల చేస్తారని అంతా భావించారు. కాని ఓటీటీ విడుదలకు కూడా సిద్దం చేయడం లేదు.
ఓటీటీ లో అయినా రొమాంటిక్ ను విడుదల చేస్తే చూస్తామంటూ పూరి అభిమానులు కోరుతున్నారు. ఆమద్య రొమాంటిక్ సినిమా పోస్టర్స్ వచ్చిన సమయంలో వర్మ చేసిన వ్యాఖ్యలతో సినిమా గురించి నెటిజన్స్ తెగ చర్చించారు. రెండవ సినిమాతోనే రొమాన్స్ లో పూరి తనయుడు రెచ్చి పోయాడు అంటూ కామెంట్స్ వచ్చాయి. తీరా చూస్తే సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. మరి సినిమా ముందు ముందు అయినా విడుదల అయ్యేనా అనేది చూడాలి.
రొమాంటిక్ మూవీ అలా ఉండగానే ఆకాష్ పూరి తన తదుపరి సినిమాల పనిలో పడ్డాడు. ఇప్పటికే చోర్ బజార్ అనే సినిమాను చేస్తున్న ఆకాష్ మరో సినిమాకు కూడా సైన్ చేశాడు. ఆ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ రెండు సినిమాలు వచ్చేప్పటికి అయినా రొమాంటిక్ సినిమాను పూరి విడుదల చేస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది.