ఆసక్తిని పెంచుతున్న 'అఖండ' టైటిల్ సాంగ్ టీజర్!

Update: 2021-11-04 09:55 GMT
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందింది. మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. దీపావళి సందర్భంగా ముందుగా ప్రకటించిన విధంగా ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టైటిల్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. బాలకృష్ణ పోషించిన అఘోర పాత్రపైనే ఈ టైటిల్ సాంగును చిత్రీకరించారు. 'భం అఖండ .. భం అఖండ' అంటూ ఈ సాంగ్ సాగుతోంది. అఘోర పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందనేది ఈ పాటతో చెప్పడానికి ప్రయత్నించారు. విజువల్స్ బాలకృష్ణ స్థాయికి తగినట్టుగానే ఉన్నాయి.

తమన్ సంగీతానికీ .. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి వంకబెట్టవలసిన అవసరం లేదు. కానీ ఎందుకోమరి ఈ టీజర్ విషయంలో మాత్రం సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేసినట్టుగా అనిపిస్తోంది. సాహిత్యం సరిగ్గా అర్థం కావడం లేదు. ఈ  టైటిల్ సాంగ్ ను పూర్తిస్థాయిలో ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. అప్పటికి ఈ సమస్య లేకుండా చూసుకుంటారేమో చూడాలి. ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ ఇంకా రాలేదు. డిసెంబర్ 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఈ సినిమాలో మోతుబరి రైతుగా .. అఘోరాగా బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రల మధ్య గల సంబంధం ఏమిటనేది సస్పెన్స్ గా ఉంచారు. బాలకృష్ణతో తలపడే పవర్ఫుల్ విలన్ పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఇక విలన్ పాత్రలలో బిజీ కావాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. మరో కీలకమైన పాత్రలో జగపతిబాబు తన నటనలోని కొత్త కోణాన్ని చూపించనున్నాడు. కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించగా ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. ఇక ఈ దీపావళి తరువాత నుంచి ప్రమోషన్స్ జోరు మరింత పెంచనున్నట్టుగా తెలుస్తోంది.

ఇంతకుముందు బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'లెజెండ్' .. 'సింహా' సినిమాలు సంచలన విజయాలకి సరైన అర్థం చెప్పాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతకుముందు బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేసినప్పటికీ, ఈ రెండు సినిమాల్లో ఆయన లుక్స్ .. ఆయన పాత్రల్లోని సత్తా డిఫరెంట్ గా అనిపిస్తాయి. అలాగే ఈ సారి కూడా బాలకృష్ణ లుక్స్ విషయంలో బోయపాటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాతో బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.


Full View
Tags:    

Similar News